/rtv/media/media_files/2025/07/09/kcr-2025-07-09-13-28-04.jpg)
KCR
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోయినా, ఈ పోరాటంలో తాము నైతికంగా గెలిచామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఫలితం ఎలా ఉన్నా కూడా కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని.. స్థైర్యాన్ని కోల్పోవద్దని వారికి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ విజయంపై కేసీఆర్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడటం, అక్రమ మార్గాలను అనుసరించడం ద్వారా ఈ ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేద్దామని తెలిపారు. ప్రజాసమస్యలపై మన పోరాటం ఆగదని.. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని కేసీఆర్ అన్నారు.
Follow Us