జమ్మూ కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అతనితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ హాజరయ్యారు. వీరితో పాటు సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్‌తో పాటు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇది కూడా చూడండి: Nithin : వేణు ఎల్లమ్మ మూవీకి గ్రీన్ సిగ్నల్.. ఆ కుర్ర హీరో ఎవరంటే?
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించాయి. మ్యాజికల్ ఫిగర్‌ను దాటి ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజార్టీ వచ్చింది. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని కేంద్ర రద్దుచేయడంతో.. తొలసారిగా జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యారు.
ఇది కూడా చూడండి: ఈ దీపావళికి సినిమాల ధమాకా.. ఏకంగా ఆరు చిత్రాల సందడి!
ఎవరీ ఒమర్ అబ్దుల్లా?
ఒమర్ అబ్దుల్లా ప్రముఖ కశ్మీరీ ముస్లిం కుటుంబానికి చెందినవాడు. ఒమర్ తాత, షేక్ ముహమ్మద్ అబ్దుల్లా.. జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీని స్థాపించారు. జమ్మూ, కశ్మీర్‌లో వేర్వేరు సమయాల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఒమర్ తండ్రి ఫరూక్ అబ్దుల్లా కూడా మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒమర్ బొంబాయిలోని కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత వ్యాపార అధ్యయనాలను స్కాటిష్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు.
ఇది కూడా చూడండి: Sabarimala భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజకీయ ప్రయాణం
ఒమర్ అబ్దుల్లా తన 28 ఏళ్ల వయస్సులో 1998లో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యునిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలో చేరాడు. అతి చిన్న వయస్సులోనే విదేశీ వ్యవహారాల మంత్రి అయ్యాడు. ఒమర్ తన తండ్రి నుంచి 2002లో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ ఏడాది ఎన్నికల్లో ఓడిపోయి 2004లో తిరిగి లోక్‌సభలో చేరారు. మళ్ల 2008 ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 38 ఏళ్ల వయస్సులో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి 2015లో పదవికి రాజీనామా చేశారు.
ఇది కూడా చూడండి: హాట్ అందాలతో కేతిక శర్మ ఫోజులు.. వైట్‌శారీలో అందాల ఆరబోత