Sabarimala భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకపోయిన శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. కేవలం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటేనే దర్శనం ఉంటుందనే దానిపై ఎక్కువగా విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
sabarimala

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అయ్యప్ప దర్శనం చేసుకోవాలంటే కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే నమోదు చేసుకోవాలన్నా నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటేనే దర్శనం అనే నిర్ణయంపై ఎక్కువగా విమర్శలు రావడంతో ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోకపోయినా భక్తులకు తప్పకుండా అయ్యప్ప దర్శనం కల్పిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు.

ఇది కూడా చూడండి: Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకి ఈడీ క్లీన్ చిట్..!

టికెట్లు లేకుండా దర్శనమా?

భక్తులు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు లేదా తప్పిపోయినప్పుడు వారిని గుర్తించేందుకు ఆన్‌లైన్ టికెట్ ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే గతేడాదిలా స్పాట్‌ బుకింగ్‌ విధానాన్ని కొనసాగిస్తారా లేకపోతే టికెట్లు లేకుండా దర్శనానికి వీలు కల్పిస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇదిలా ఉండగా.. దర్శనాల విషయానికొస్తే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు అయ్యప్ప దర్శన సమయాన్ని పొడిగిస్తున్నట్లు కూడా ఇటీవల తెలిపింది.

ఇది కూడా చూడండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్!

ఆలయంలో ఉండే ప్రధాన పూజారులు అందరిని సంప్రదించిన తర్వాతే ట్రావెన్‌కోర్ దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే శబరిమలలో అయ్యప్ప దర్శన వేళలు కూడా మర్చారు. వేకువ జామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించగా మళ్లీ తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగిస్తారని తెలిపింది. దర్శన సమయాల్లో మార్పుల వల్ల భక్తులకు రోజుకీ 17 గంటల సమయం కేటాయించినట్లు అవుతుంది. 

ఇది కూడా చూడండి: Andhra Pradesh: మహిళలకు గుడ్‌న్యూస్.. ఆరోజు నుంచే ఫ్రీ బస్ అమలు

నవంబరు 15 నుంచి శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇవి డిసెంబరు 26 వరకు కొనసాగుతాయి. అయితే ఈ రోజు ఆలయాన్ని మూసి మళ్లీ డిసెంబరు 30న మకరు విళక్కు పూజల కోసం తెరుస్తారు. మకర జ్యోతి దర్శనం జనవరి 14న మకర సంక్రాంతి రోజు, పడిపూజ జనవరి 20తో మకరు విళక్కు సీజన్ క్లోజ్ అవుతుంది. అయితే ప్రతి రోజూ గరిష్టంగా దాదాపు 80 వేల మంది భక్తులను అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతించాలని ట్రావెన్‌ కోర్ దేవస్థానం బోర్డు భావిస్తోంది. 

ఇది కూడా చూడండి: Revanth Reddy: అక్కా.. కొంచెం తగ్గు: కొండా సురేఖకు రేవంత్ క్లాస్!

Advertisment
తాజా కథనాలు