CID Officers: పోసానికి బిగ్ షాక్.. సీఐడీ కేసు నమోదు ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారం చేసినందుకు పోసాని కృష్ణమురళిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోసాని మాట్లాడారని బండారు వంశీకృష్ణ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. By Kusuma 18 Nov 2024 in రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి పోసాని కృష్ణమురళికు వరుస షాక్‌లు తగులుతున్నాయి. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారం చేశారని రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోసాని వ్యాఖ్యలు ఉన్నాయి. రెండు వర్గాల మధ్య గొడవలు వచ్చే విధంగా పోసాని మాట్లాడారన్నారు. ఇది కూడా చూడండి: BIG BREAKING: వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు నేరం రుజువైతే తప్పకుండా.. పోసానిపై కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ సీఐడీని కోరారు. దీంతో పోసాని మురళికృష్ణపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ యాక్ట్ 111, 196, 353, 299, 336(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది కూడా చూడండి: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలకనేత ఇదిలా ఉండగా.. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌తో పాటు మరికొందరిపై అసభ్యకర వ్యాఖ్యాలు చేశారు. ఇందులో భాగంగా పోసానిపై పలు స్టేషన్‌లో మొత్తం 5 చోట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ అండ చూసుకుని ముందు వెనుక చూడకుండా పోసాని టీడీపీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వారి మెడకు ఉచ్చు బిగిస్తోంది. ఇది కూడా చూడండి: BIG BREAKING: హైదరాబాద్‌లో ఐటీ దాడులు అలాగే అనంతపురంలో పోసాని దిష్టి బొమ్మను సైతం తెలుగు యువత, ఎస్సీ సెల్ నాయకులు దహనం చేశారు. ఈ మేరకు నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోసానికి రెండు మూడు రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా మరోవైపు సినీ నటి శ్రీరెడ్డిపై సైతం పలు పోలీస్టేషన్‌లలో ఫిర్యాదులు చేయగా.. వాటిలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చూడండి: అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్ #cid-officers #chandrababu #posani krishna murali news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి