EX Minister Mallareddy: రాజకీయాల్లో నేను నెం1: మల్లారెడ్డి మరో సంచలనం!
తెలంగాణ రాజకీయాల్లో తానే నెంబర్ 1 అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనకు మంచి మనసు ఉందని, అన్నీ మంచి పనులే చేస్తానన్నారు. చిన్నప్పటినుంచి కష్టపడే తత్వం ఉందన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో తానే నెంబర్ 1 అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనకు మంచి మనసు ఉందని, అన్నీ మంచి పనులే చేస్తానన్నారు. చిన్నప్పటినుంచి కష్టపడే తత్వం ఉందని, వర్క్ కమిట్ మెంట్ తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వ్యాపారంలో కింది స్థాయి నుంచి ఎదిగిన తాను.. పలు విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఏర్పాటు చేశానని చెప్పారు. తాను ప్రపంచమంతా తిరిగొచ్చానని, అదే విధంగా ఇక్కడ కూడా విద్యా అందించాలని ఫిక్స్ అయినట్లు చెప్పారు. పలు దేశాలు మనకంటే 8 ఏళ్లు ముందున్నారని, ఆ విధంగా మనం ఎదగాలన్నారు.
ఇక రేవంత్ రెడ్డికి తొడగొట్టి సవాల్ చేసిన సందర్భం కావాలని చేయలేదని, తాను ఎవరిని బూతులు తిట్టలేదని, తిట్టనని చెప్పారు. రేవంత్ గతంలో తనను తన నియోజకవర్గంలోకి వచ్చి తిడితేనే తాను ఎదురుదాడి చేసినట్లు తెలిపారు. ఆయన మా మనుమరాలు పెళ్లికి వచ్చారని, రాజకీయంలో వివదాలు కామన్ అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ వెళ్దామని అనుకోలేదు కానీ, తన కొడుకు కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ట్రై చేశారు. కానీ అది కుదరలేదు. కాంగ్రెస్ పార్టీలో ఆగం ఆగం ఉందని, తనకు అలాగే కనిపిస్తుందన్నారు.
రాజకీయ వారసుడు లేడని, 25 శాతమే రాజకీయంపై ఆసక్తి ఉంటుందని, ఫోకస్ మొత్తం విద్యా సంస్థలపైనే ఉందన్నారు. యూనివర్సీటిలే తరతరాలు ఉంటాయని, పర్మినెంట్ ఉండేవి, చరిత్రలో పేరు నిలిచిపోయేవి విద్యా సంస్థలే అన్నారు. విద్యా సంస్థలకు పిల్లలంతా వారసులేనని, అందరికీ అధికారం ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్లు, ఇంజనీర్లను తయారు చేయడమే తన జీవిత లక్ష్యం అన్నారు. కేసీఆర్ హయాంలో తాను లేబర్ మినిస్టర్ గా అద్భుతంగా పనిచేశానన్నారు.

EX Minister Mallareddy
EX Minister Mallareddy:

Also Read: మళ్లీ ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తున్న పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు
ఇక రేవంత్ రెడ్డికి తొడగొట్టి సవాల్ చేసిన సందర్భం కావాలని చేయలేదని, తాను ఎవరిని బూతులు తిట్టలేదని, తిట్టనని చెప్పారు. రేవంత్ గతంలో తనను తన నియోజకవర్గంలోకి వచ్చి తిడితేనే తాను ఎదురుదాడి చేసినట్లు తెలిపారు. ఆయన మా మనుమరాలు పెళ్లికి వచ్చారని, రాజకీయంలో వివదాలు కామన్ అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ వెళ్దామని అనుకోలేదు కానీ, తన కొడుకు కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ట్రై చేశారు. కానీ అది కుదరలేదు. కాంగ్రెస్ పార్టీలో ఆగం ఆగం ఉందని, తనకు అలాగే కనిపిస్తుందన్నారు.
Also Read: Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు
రాజకీయ వారసుడు లేడని, 25 శాతమే రాజకీయంపై ఆసక్తి ఉంటుందని, ఫోకస్ మొత్తం విద్యా సంస్థలపైనే ఉందన్నారు. యూనివర్సీటిలే తరతరాలు ఉంటాయని, పర్మినెంట్ ఉండేవి, చరిత్రలో పేరు నిలిచిపోయేవి విద్యా సంస్థలే అన్నారు. విద్యా సంస్థలకు పిల్లలంతా వారసులేనని, అందరికీ అధికారం ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్లు, ఇంజనీర్లను తయారు చేయడమే తన జీవిత లక్ష్యం అన్నారు. కేసీఆర్ హయాంలో తాను లేబర్ మినిస్టర్ గా అద్భుతంగా పనిచేశానన్నారు.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
Also Read: కోల్‌కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు