BIG BREAKING: రాహుల్ గాంధీపై మర్డర్ కేసు

పార్లమెంట్‌లో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు. రాహుల్ గాంధీ నెట్టేయడం వల్ల అతని తలకు గాయమైందని ప్రతాప్ ఆరోపించారు. ఈక్రమంలో రాహుల్‌ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
BJP Mp Prathap Singh

BJP Mp Prathap Singh Photograph: (BJP Mp Prathap Singh)

పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్ష సభ్యులు నిరసనల వల్ల అంతా గందరగోళం ఏర్పడింది. అంబేద్కర్‌ను అమిత్‌షా అవమానించారని, చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్‌ను అవమానించిందని అధికార పార్టీ ఎంపీలు నిరసనలు చేపట్టారు.

ఇది కూడా చూడండి: హైదరాబాద్ బుక్ ఫెయిర్.. నేటి నుంచే ప్రారంభం

ఇది కూడా చూడండి: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు

నెట్టేయడంతో కింద పడి..

ఇందులో భాగంగా పార్లమెంట్‌లోకి వస్తున్న అధికార పార్టీ ఎంపీలను విపక్ష పార్టీ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు. మెట్ల దగ్గర నిల్చోని ఉండటంతో రాహుల్ గాంధీ ఒక ఎంపీని నెట్టారట. దీంతో అతను వచ్చి ప్రతాప్ చంద్రపై పడటంతో కిందపడటంతో ప్రతాప్ చంద్ర తలకు గాయం అయ్యిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీపై పోలీసులకు మర్డర్ కేసు ఫిర్యాదు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: టాలీవుడ్‌లో విషాదం.. బలగం మొగిలయ్య ఇకలేరు

ఇది కూడా చూడండి: BREAKING: ప్రముఖ రచయిత కన్నుమూత

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు