Telangana:బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లుక్ అవుట్ నోటీసు

ప్రజాభవన్ గేట్లను కారు గుద్దిన కేసులో కోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. నిన్న పంజాగుట్ట సీఐ దుర్గారావును అరెస్ట్ చేశారు. ఈరోజు బీఆర్ఎస్ మాజీ ఎమ్మల్యే షకీల్ మీద లుక్ అవుట్ నోటీసులను జారీ చేశారు.

Ex MLA Shakeel: అలా చేస్తే నా కొడుకుని ఉరితీయండి.. మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు
New Update

Prajabhavan Accident case:హైదరాబాద్‌లో ప్రజా భవన్‌ ప్రమాదం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉందన్న కారణంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు లుక్‌ అవుట్ నోటీసులు పంపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన సాహిల్‌ను తప్పించడానికి షకీల్ ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు తన కొడుకు సాహిల్‌తో పాటూ షకీల్ కూడా దుబాయ్ పారిపోయాడని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇందులో సంబంధం ఉన్న 16మంది మీద కేసులు నమోదు చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. సాహిల్, షకీల్‌తో పాటూ వారి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read:Telangana:9వేల అంగన్వాడీ పోస్టులకు ప్రభుత్వం కసరత్తు

పంజాగుట్ట సీఐ దుర్గారావు అరెస్ట్..

ఇదే కేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావు(Punjagutta CI Durga Rao) కూడా నిందితుడిగా ఉన్నారు. సాహిల్‌ను తప్పిండచంలో సీఐ సహాయం చేశారని ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా పోలీసులు సేకరించారు. ఇంతకు ముందే ఈ కేసులో ఏ11 నిందితుడిగా ఉన్న దుర్గారావును విధుల నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి అతను అజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేసుకున్నారు. అయితే ఈ కేసు కోర్టులో విచారణకు రాకముందే సీఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం ఆంధ్రాలోని గుంతకల్లు రైల్వే స్టేషన్‌(Guntakal Railway Station) లో దుర్గారావు పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. వెస్ట్ జోన్ డీజీపీ ఆఫీస్‌లో ఇతన్ని విచారిస్తున్నారు.

ఏం జరిగింది..

గత నెల 23న సాహిల్ ప్రజాభవన్ ముందు కారుతో బీభత్సం సృష్టించాడు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రజాభవన్ వద్ద ఉన్న బారీకేడ్లను ఢీకొట్టి ధ్వంసం చేశాడు. అయితే ఈ సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. వాళ్లకు ఎలాంటి గాయాలు కాలేవు. కారు ప్రమాదం(Car Accident) విజువల్స్ చివరికి సీసీ టీవీ కెమెరాల్లో దొరికాయి. దీంతో పోలీసులు సాహిల్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను కూడా సస్పెండ్ చేశారు.

#ex-mla #telangana #brs #bodhan #shakeel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe