Telangana:బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లుక్ అవుట్ నోటీసు
ప్రజాభవన్ గేట్లను కారు గుద్దిన కేసులో కోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. నిన్న పంజాగుట్ట సీఐ దుర్గారావును అరెస్ట్ చేశారు. ఈరోజు బీఆర్ఎస్ మాజీ ఎమ్మల్యే షకీల్ మీద లుక్ అవుట్ నోటీసులను జారీ చేశారు.
ప్రజాభవన్ గేట్లను కారు గుద్దిన కేసులో కోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. నిన్న పంజాగుట్ట సీఐ దుర్గారావును అరెస్ట్ చేశారు. ఈరోజు బీఆర్ఎస్ మాజీ ఎమ్మల్యే షకీల్ మీద లుక్ అవుట్ నోటీసులను జారీ చేశారు.
ప్రజాభవన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో ప్రధాన నిందితుడు అయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్‌ను పక్కా పథకం ప్రకారం తప్పించారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఒక సీఐని, మరికొందరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారు.
ప్రజా భవన్ బ్యారికేడ్లను ఢీకొట్టింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడేనని తేల్చారు వెస్ట్ జోన్ పోలీసులు. మద్యం మత్తులో షకీల్ కొడుకు సోహెల్ బారికేడ్లను గుద్దాడని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. కారులో సోహెల్ తో పాటూ ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు.