KCR: నల్గొండలో కేసీఆర్‌ సభకు నో పర్మిషన్‌.. ఎందుకంటే..

నల్గొండలో ఈనెల 13న బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ ప్రకటించగా.. ఈ సభ అనుమతిపై ఉత్కంఠ నెలకొంది. నెలరోజుల పాటు ఎలాంటి బహిరంగ సభలకు వీల్లేదని.. ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఆ జిల్లాలో 30, 30ఏ యాక్ట్‌ను అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు.

KCR: నల్గొండలో కేసీఆర్‌ సభకు నో పర్మిషన్‌.. ఎందుకంటే..
New Update

నల్గొండలో ఈనెల 13న బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని మాజీ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభకు అనుమతిపై ఉత్కంఠ నెలకొంది. నల్గొండలో నెలరోజుల పాటు ఎలాంటి బహిరంగ సభలకు వీల్లేదని.. ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఆ జిల్లాలో 30, 30ఏ యాక్ట్‌ను అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ముందస్తు అనుమతులు లేకుండా.. ధర్నాలు, రాస్తరోకోలు, నిరసనలకు పోలీసులు నో అంటున్నారు. అయితే కేసీఆర్‌ సభ ఉంటుందనే పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది.

సాగునీటి హక్కులు కాపాడేందుకే సభ

దీంతో ఇప్పుడు కేసీఆర్‌ నిర్వహించబోయే ఆ సభ జరగుతుందా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే తాజాగా తెలంగాణ జిల్లాల నేతలతో కేసీఆర్‌ సమావేశమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర రైతు ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ(KRMB)కి అప్పగిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన ఖండించారు. దీంతో కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకే.. నల్గొండలో సభ పెట్టుకుందామని పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

కేంద్రం చేతికి మన జుట్టు అందించారు

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందంటూ కేసీఆర్‌ అన్నారు. కేఆర్ఎంబీ కి నాగార్జునసాగర్, శ్రీశైలంతో పాటు కృష్ణా నదిమీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్ర ప్రభుత్వం చేతికి మన జుట్టు అందించిందని ఆరోపించారు. ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతామని బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు.

రేవంత్‌కు అవగాహన లేదు

అలాగే సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా కేసీఆర్‌ విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులపై రేవంత్‌కు అవగాహన లేదని అన్నారు. ఒకవేళ ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదంటూ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం వస్తే మనం అడుక్కోవాల్సి వస్తుందని అన్నారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్‌ వాళ్లకు అవగాహన లేకే ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకున్నారని కేసీఆర్ చురకలంటించారు.

#ex-cm-kcr #telangana-politics #telangana-news #telugu-news #kcr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి