/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-12T130727.256.jpg)
Constable Jobs in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో ఆయన సమీక్షించారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని.. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేయాలని సూచించారు. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో కృషి చేయాలని కోరారు.