Duvvada Srinivas: దువ్వాడ శ్రీను, మాధురి వ్యవహారంలో మరో ట్విస్ట్! దువ్వాడ శ్రీను, మాధురి ఇష్యూ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మాధురిని పలాస నుంచి విశాఖలోని మరో ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అయితే.. కారు పల్టీలు కొట్టినా మాధురి శరీరంపై చిన్న గాయం కూడా కాలేదన్న ప్రచారం అనుమానాలకు తావిస్తోంది. By Bhavana 12 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి Duvvada Srinivas - Madhuri : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ వ్యవహారం పై కొన్ని రోజులుగా ఆయన భార్య వాణి తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి అనే ఆమెతో నే ఉంటున్నారని..వారి ఇంటి ముందు వాణి, వారి పెద్ద కుమార్తె బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే దివ్వెల మాధురి (Divvela Madhuri) కారు ప్రమాదం లో గాయపడ్డారు. అయితే ఆమె తన మీద వస్తున్న ట్రోల్స్ ని తట్టుకోలేకనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొంది. స్థానికులు, పోలీసులు ఆమెను పలాస ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా..మెరుగైన చికిత్స కోసం టెక్కలి హాస్పిటల్ నుంచి విశాఖపట్నం ఆరిలోవ అపోలో హాస్పిటల్ లో చేరారు. ఆమెను అపోలో సిబ్బంది పరదాల చాటు ఆసుపత్రిలోనికి తీసుకుని వెళ్లడం, సెక్యూరిటీ సిబ్బంది అతి చేయడం మాధురి పై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే మాధురి కారు యాక్సిడెంట్, ఆత్మహత్యాయత్నం అనేవి డ్రామా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె అలా పరదాల చాటున వెళ్లడం కూడా ఆ వాదనలకు మరింత ఊతమిచ్చింది. కారు పల్టీలు కొట్టింది అని చెబుతున్నప్పటికీ మాధురి ఒంటి పై చిన్న గాయం కూడా కనిపించడం లేదు...అంతేకాకుండా ఇప్పటి వరకు ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పటి వరకు హెల్త్ బులెటిన్ బయటకు రాలేదు. వీటిని అన్నిటిని చూస్తుంటే ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. Also Read: పెళ్లి పందిట్లో వరుడి పై యాసిడ్ దాడి..ఎక్కడంటే! #vani #duvvada-srinivas #divvela-madhuri #ycp-mlc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి