PM Modi: ఎన్నికల శంఖారావం పూరించిన ప్రధాని.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌పై నెక్ట్స్ లెవల్‌ పంచ్‌లు..

పాలమూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. తెలంగాణ మార్పు కోరుకుంటోందని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యం అని విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. తమకు అవినీతి సర్కార్ కాదు.. పారదర్శక ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందన్నారు.

New Update
PM Modi: ఎన్నికల శంఖారావం పూరించిన ప్రధాని.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌పై నెక్ట్స్ లెవల్‌ పంచ్‌లు..

PM Narendra Modi Public Meeting: పాలమూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తెలంగాణ(Telangana) ఎన్నికలకు సమరశంఖం పూరించారు. తెలంగాణ మార్పు కోరుకుంటోందని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యం అని విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. తమకు అవినీతి సర్కార్ కాదు.. పారదర్శక ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందన్నారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్, ఎంఐఎం లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కమీషన్లు, కరప్షన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల సిద్ధాంతం అని ఘాటైన కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పేరు చెప్పుకుని, ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. ప్రాజెక్టుల మీరు మీద ఆర్భాటాలు, హంగామాలు జరుగుతాయిన ఆనీ.. రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వరని విమర్శించారు ప్రధాని మోదీ. రుణ మాఫీ చేస్తామని చెప్పి.. ఎందరో రైతుల మరణాలకు కారణం అయ్యారని బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధిని బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. కారు స్టీరింగ్ ఎవరి చేతిలో అందరికీ తెలుసునని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రజాస్వామ్యాన్ని కుటుంబ స్వామ్యంగా మార్చాయని విమర్శించారు. ఆ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అంటూ సెటైర్లు వేశారు. పెద్ద పోస్టుల్లో కుటుంబ సభ్యులుంటారు.. తమ అవసరాల కోసం కొందరు బయటి వ్యక్తులు ఉంటారంటూ విమర్శించారు. పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవుల్లోనూ కుటుంబ సభ్యులే ఉంటారన్నారు.

రాష్ట్రంలోని అవినీతి ప్రభుత్వం భూమి ఇస్తే ఎప్పుడో గిరిజన సెంట్రల్ వర్సిటీ వచ్చేదని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భూమి ఇచ్చేందుకు ఈ ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టిందని విమర్శించారు. దీన్నిబట్టి ఈ ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. సభకు వచ్చిన ప్రజల ఉత్సాహాన్ని చూస్తే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఈ రాత్రి నిద్ర కూడా పట్టదని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ అని, వరుణ దేవుడు(వర్షం) కూడా ఆశీర్వాదం ఇచ్చేందుకు వచ్చారని అన్నారు ప్రధాని మోదీ. కేంద్ర ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి, గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే 27 వేల కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లలో జమ చేశామని వివరించారు. కానీ, ఇక్కడి ప్రభుత్వం మాత్రం రైతుల పేరు చెప్పుకుంటూ.. ఆ రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు ప్రధాని మోదీ.

Also Read:

Telangana Turmeric Board: తెలంగాణపై ప్రధాని వరాల జల్లు.. పసుపు బోర్డు ప్రకటన..

YS Jagan: అంతా రెడీ.. విజయదశమికి ఛలో విశాఖ.. ఈ నెల 23న సీఎం జగన్ గృహ ప్రవేశం

Advertisment
తాజా కథనాలు