దసరా పర్వదినం రోజున సీఎం జగన్ ( cm jagan) విశాఖపట్నంలో గృహప్రవేశానికి సిద్దమవుతున్నారు. మరో మూడు వారాలకు మించి సమయం లేకపోవడంతో తాడేపల్లి నుంచి క్యాంప్ ఆఫీసు షిఫ్టింగ్‌కి రెడీ చేస్తున్నారు. ఈనెల 23న గృహ ప్రవేశానికి ముహూర్తం కూడా ఖరారైంది (time to enter the house is fixed). 24 నుంచి సీఎం జగన్ వైజాగ్ క్యాంప్ ఆఫీస్ నుంచి పాలన కొనసాగించనున్నారు. దీంతో యంత్రాంగం కూడా అంతే స్పీడ్‌తో కదులుతోంది. విశాఖపట్నం-భీమిలి బీచ్ రోడ్డులోని.. రుషికొండపై ఏపీ టూరిజం శాఖ శ్రద్ధ పెట్టి కడుతున్న కాంప్లెక్స్‌లోనే సీఎం నివాసం ఉండబోతున్నారు. సీఎం మాత్రమే కాదు.. అనుబంధ శాఖలకు సంబందించిన ఉన్నతాధికారులంతా ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని ఏపీ సర్కార్ ఇప్పటికే చెప్పేసింది. సీఎం విశాఖ పాలనపై ఎంపీ విజసాయిరెడ్డి సైతం తాజాగా స్పందించారు.
పూర్తిగా చదవండి..YS Jagan: అంతా రెడీ.. విజయదశమికి ఛలో విశాఖ.. ఈ నెల 23న సీఎం జగన్ గృహ ప్రవేశం
విజయదశమికి ఛలో విశాఖ.. ముహుర్తం ఫిక్సైంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఇక మిగిలింది కేవలం మరో మూడు వారాలే. దీంతో అధికారులు అన్ని పనులను పూర్తి చేస్తున్నారు.
Translate this News: