PM Modi: భారత్‌ అభివృద్ధి చెందేది అప్పుడే: ప్రధాని మోదీ

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. జార్ఖండ్‌లోని శుక్రవారం నిర్వహించిన ర్యాలీని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

PM Modi : ఇప్పటి వరకు చూపించింది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది..!
New Update

PM Modi: లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికీ అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓవైపు మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. మరోవైపు మోదీ సర్కార్‌ను గద్దె దించాలని ఇండియా కూటమితో సహా ఇతర విపక్ష పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీల నేతలు ఎన్నికల రణరంగంలోకి దిగారు. ప్రధాని మోదీ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. తాజాగా జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో శుక్రవారం నిర్వహించిన ర్యాలీని ఉద్దేశిస్తూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: దారుణం.. బాలికను నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం

వికసిత్‌ భారత్‌ దిశగా

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. గత క్వార్టర్‌లో ఇండియా ఏకంగా 8.4 శాతంగా వృద్ధి సాధించినట్లు చెప్పారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యాల దిశగా వేగవంతమైన వృద్ధిని సాధిస్తూ భారత్‌ దూసుకెళ్తోందని అన్నారు. అలాగే గత పదేళ్లుగా జార్ఖండ్‌ అభివృద్ధి కోసం.. గిరిజనులు, పేదలు, యువత, మహిళల సాధికారత కోసం తాము పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌

భారత్‌ను 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వికసిత్‌ భారత్‌ను సాధించేందుకు జార్ఖండ్‌ను జార్ఖండ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారుచేయడం కీలకమని చెప్పారు. అంతేకాదు జార్ఖండ్‌ను అభివృద్ధి చేసేందుకు తమ సర్కార్‌ అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా.. ఇటీవల మాన్‌కీ బాత్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. తన కార్యక్రమాన్ని ఎన్నికల దృష్ట్యా మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నానని తెలిపారు. అలాగే మార్చి నెలలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ రానుందని వెల్లడించారు.

Also Read: సింహం నోట్లో చేయిపెట్టిన యువకుడు.. మూడు పళ్లతో అదిమిపట్టిన మృగం!

#jharkhand #national-news #telugu-news #pm-modi #developed-india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి