Crime News: దారుణం.. బాలికను నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం హర్యానాలోని జింద్ జిల్లాలో ఓ బాలికను ఓ ఇంట్లో నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు కనిపించకపోవడంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలో దిగిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. By B Aravind 01 Mar 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Crime News: సమాజంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలు లైంగిక దాడులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా హర్యానా రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు ఓ బాలికను కిడ్నాప్ చేసి.. 20 రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరికి ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను రక్షించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హర్యానాలోని జింద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. Also Read: ‘వన్ ఛాయ్ ప్లీస్’.. డాలీ చాయ్‌వాలా టీ ఆస్వాదించిన బిల్‌గేట్స్ అయితే 20 రోజుల క్రితం 15 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆమెను ఓ ఇంట్లో నిర్భందించారు. 20 రోజులకు పైగా ఆమెపై అత్యాచారం చేశారు. కూతురు కనిపించకపోవడంతో.. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకి తెలుసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆమె ఇంట్లో నిర్భందంలో ఉన్నట్లు గుర్తించి.. ఆమెను రక్షించారు. ఆ తర్వాత బాలిక చెప్పిన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆ బాలిక గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో సహా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నారు. అయితే ఈ విషయం బయటపడటంతో అక్కడి స్థానికులు నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Also Read: ఐక్యరాజ్యసమితిలో పాక్‌ను ఏకిపారేసిన భారత్..అనుపమ సింగ్ కోసం నెటిజన్లు సెర్చింగ్.! #telugu-news #national-news #crime-news #rape మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి