Britain General Elections : బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ (Labour Party) భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ యూకే (UK) ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో లేబర్ పార్టీ విజయంపై ప్రధాని మోదీ (PM Modi) ఎక్స్‌లో స్పందించారు. కీర్ స్టార్మర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Also Read: భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తి.. బయటపడుతున్న విస్తుపోయే నిజాలు
' యూకే పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కీర్ స్టార్మర్ (Keir Starmer) కు హృదయపూర్వక అభినందనలు. భారత్ - యూకే మధ్య పరస్పర వృద్ధి, శ్రేయస్సును పెంపొందించేలా అన్ని రంగాల్లో వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని మరింతగా బలపరేంచుందుకు మన సానుకూల, నిర్మాణాత్మక సహకారం కోసం ఎదురు చూస్తున్నానంటూ' మోదీ పేర్కొన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన కన్జర్వేటివ్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్‌కు కూడా మోదీ తన సందేశం పంపారు. సునాక్ అద్భతమైన నాయకత్వం, భారత్-యూకే సంబంధాలు బలోపేతం చేయడంలో కృషి చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలాఉండగా.. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటీవ్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. 14 ఏళ్ల తర్వాత ఆ పార్టీ ఓటమిని చవిచూసింది. యూకే ప్రజలు లేబర్ పార్టీకి 412 స్థానాల్లో గెలిపించగా.. కన్జర్వేటివ్ పార్టీ మాత్రం కేవలం 121 స్థానాలకే పరిమితమైంది. దీంతో లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కన్జర్వేటీవ్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధానమంత్రి రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ అపజయానికి తానే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు.