PM Modi : ప్రచార సభలో కాంగ్రెస్, ముస్లింలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు..ఈసీకి ఫిర్యాదు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో ముస్లింలపై కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీనే స్వయంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ఇలా మాట్లాడ్డం ఇప్పుడు దుమారం రేపుతోంది. దాంతో పాటూ మోదీ మీద కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. By Manogna alamuru 22 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి PM Modi Comments On Congress And Muslims : కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, భూములు, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుంది అంటూ ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పిందని ఆరోపించారు. మీ కష్టార్జితాన్ని చొరబాటుదారులకు పంచేందుకు మీరు అంగీకరిస్తారా?’ అని ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా(Social Media) లో పెద్ద దుమారమే రేగింది. ప్రధాని మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ మీద అభాండులుగా పరిణమించడమే కాకుండా మత విద్వేషాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఒక దేశ ప్రధాని అయి ఉండి మోదీ అలా ఎలా మాట్లాడతారని కాంగ్రెస్‌తో పాటూ అందరూ విమర్శిస్తున్నారు. మోదీ మత విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎన్నికల నింబంధలను ఉల్లఘించి ముస్లింలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. అసలేమన్నారంటే.. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) షహరాన్‌పూర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ఈ వ్యాఖ్యలను చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ముస్లింలీగ్‌లో ఉన్న ఆలోచననే ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతిబింబిస్తోందన్నారు మోదీ. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లింలీగ్ ముద్ర ఉందని, ఈ ముస్లిం లీగ్ మేనిఫెస్టోలోని మిగిలిన భాగాలపై వామపక్షాలు పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయని విమర్శించారు. ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్.. మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ చాలా సీరియస్‌గా తీసుకుంది. తమ మేనిఫెస్టోను మోదీ ముస్లింలీగ్‌తో పోల్చడం కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. దీని మీద ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ మీద రెండు ఫిర్యాదులతో సమా మొత్తం ఆరు కంప్లైంట్స్ చేశామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్(Jairam Ramesh) తెలిపారు. దీనికి సబంధించి ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. సల్మాన్ ఖుర్షీద్, పవన్ ఖేర్, గుర్దీప్ సప్పల్‌తో కూడిన బృందం ఫిర్యాదులను స్వయంగా ఎన్నికల కమీషన్‌కు అందించారని తెలిపారు. మోదీ తమ న్యాయ్‌పత్రని ముస్లింలీగ్‌తో పోల్చడం పూర్తిగా అసంబద్ధమని జైరాం రమేష్ అన్నారు. ఈసీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేందుకు ఇదే తగిన సమయమని...తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. Also Read:Chess : యంగ్ క్యాండిడేట్స్.. గుకేశ్ రికార్డ్ #congress #pm-modi #election-campaign #comments #muslims #manifesto మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి