Chess : యంగ్ క్యాండిడేట్స్.. గుకేశ్ రికార్డ్

కెనడాలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో యువ సచలనం, భారత ప్లేయర్ గుకేశ్ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసులో ఈ టోర్నీ గెలిచిన ప్లేయర్‌గా రికార్డ్ సాధించాడు.

New Update
Chess : యంగ్ క్యాండిడేట్స్.. గుకేశ్ రికార్డ్

Indian Chess Grandmaster Gukesh : చెస్(Chess) ఆటకు భారతదేశం(India) పెట్టింది పేరు. విశ్వనాథ్‌ ఆనంద్(Viswanath Anand) తదితరులు ఇప్పటికే బారత కీర్తిని ప్రపంచలో ఎగురవేశారు. ఇప్పుడు వారికి తోడుగా గుకేశ్(Gukesh) యాడ్ అయ్యాడు. తాజాగా జరిగిన కెనడా క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మనోడు విజయం సాధించడమే కాదు రికార్డ్ కూడా సృష్టించాడు. అతి చిన్న వయసులో 17 ఏళ్ళకే క్యాండిడేట్స్ గెలిచి చరిత్ర లిఖించాడు. మొత్తం టోరనీలో 13వ రౌండ్‌ జరిగేప్పటికి 8.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచిన గుకేశ్.. అమెరికాకు చెందిన హికరు నకమురతో జరిగిన 14వ రౌండ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో అతడి ఖాతాలో 9 పాయింట్లు చేరాయి. మరోవైపు నెపోమ్నియాషి (రష్యా) - ఫాబియానో కరువానా (అమెరికా) మధ్య మ్యాచ్‌ కూడా డ్రా అయింది. వారిద్దరూ 8.5 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో భారత యువ చెస్‌ ప్లేయర్ గుకేశ్‌ టైటిల్‌ను సాధించాడు.

గుకేశ్ కన్నా ముందు విశ్నాథ ఆనంద్ క్యాండిడేట్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఈ విజయంతో గుకేశ్ చైనా గ్రాండ్‌మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌తో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. అందులో కూడా గెలిస్తే కనుక అది మరో రికార్డ్ అవుతుంది. గుకేశ్ వయసు రిత్యా యంగ్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలుస్తాడు. అంతకు ముందు ఈ రికార్డ్ కాస్పరోవ్ పేరు మీద ఉంది. కాస్పరోవ్ 22 ఏళ్ళ వయసులో ప్రపంచ విజేతగా అవతరించాడు.

ప్రస్తుతం గుకేశ్ టాక్ ఆఫ్ ఇండియా నే కాదు టాక్ ఆఫ్ ద వరల్డ్‌(Talk Of The World) గా నిలిచాడు. ఎక్కడ చూసినా ఇతని పేరే కనిపిస్తోంది. చెస్ మాస్టర్ , భారత దిగ్గజం విశ్నాథ ఆనంద్ అయితే గుకేశ్‌ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. గుకేశ్‌ను చూసి చెస్ కుటుంబం అంతా గర్వపుడతోందని అన్నారు. అతను ఆడిన తీరు తనను అమితంగా ఆకట్టుకుంటదని చెప్పారు ఆనంద్. క్లిష్ట పరిస్థితుల్లో విజేతగా నిలిచి అందరికీ ఆదర్శం అయ్యాడని పొగిడారు. ఇక గుకేశ్ దీనికన్నా ముందు 12 ఏళ్ళ వయసులోనే వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. లాస్ట్ ఇయర్ విశ్వనాథ్‌ ఆనంద్‌ను వెనక్కి నెట్టి భారత నంబర్ వన్ చెస్ ఆ టగాడిగా కూడా అవతరించాడు.

Also Read:Viral Video : ముద్దుగా చిన్న పిల్లల్లా మారిపోయిన దేశాధినేతలు..వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు