ఎన్డీయే కుటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కింగ్‌మేకర్‌గా మారిన సంగతి తెలిసిందే. టీడీపీకి ఇచ్చే పదవులపై చర్చలు కొలిక్కి వచ్చాయి. ప్రధాని మోదీ.. టీడీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు కేంద్రమంత్రులు, ఒక సహాయ మంత్రి పదవి ఇస్తారని ప్రచారాలు జరుగుతున్నాయి. పౌర విమానయాన, వైద్యారోగ్య శాఖలతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి టీడీపీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేర్లు, శాఖలు దాదాపు ఖరారైపోయాయని ఢిల్లీలో చర్చ నడుస్తోంది.
Also Read: అమరావతిలో సందడి.. వేగంగా సాగుతోన్న పనులు!
టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్ నాయుడికి పదవి ఖరారు అయినట్లు సమాచారం. ఇక మిగిలిన రెండు పదవులు ఎవరికి ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ రెండు పదవులకు ఎంపీలు భరత్, లావు కృష్ణ దేవరాయలు రేసులో ఉన్నారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి, అమలాపురం ఎంపీ హరీష్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్.. వదులుకోబోయే సీటు ఇదే