ఆర్టికల్ 370 రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిపిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టివేయలేమని.. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాగంబద్ధమే అంటూ స్పష్టం చేసింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని.. ఆర్టికల్ 370 అనేది యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు మీద ప్రధాని మోదీ స్పందించారు. ఇదొక చారిత్రకమైన తీర్పు అంటూ పొగిడారు. ఇది జమ్మూ-కాశ్మీర్ ప్రజల ఆశలు, ప్రగతికి తోడ్పడుతుందని ప్రధాని అన్నారు. ఉన్నత న్యాయస్థానం చేసిన ప్రకటన భారతదేశ ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. సుప్రీం తీర్పుతో ఆర్టికల్ 370 వల్ల బాధలుపడిన వారిందరికీ విముక్తి లభిస్తుందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Also Read:సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దును సమర్ధించింది.. అసలు ఈ ఆర్టికల్ ఏమిటో తెలుసా?
ప్రధాని మోదీతో పాటూ కేంద్ర హోంమంత్రి అయిత్ షా కూడా సుప్రీం తీర్పు మీద స్పందించారు. సుప్రీం తీర్పుతో భారత సమగ్రత బలపడిందని చెప్పారు అమిత్ షా. జమ్మూ-కాశ్మీర్ ఎప్పుడూ మనదేనని..దానిని భారత్ నుంచి ఇంక ఎవ్వరూ విడదీయలేరని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు రుజువు చేసిందని అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు.
ఇక మరో బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా కూడా సుప్రీంకోర్టు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూ-కాశ్మీర్ ను భారత్ లో చేర్చే చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి తాను ఇంకా కోట్లాది మంది భారతీయులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నామని నడ్డా అన్నారు.