Article 370:ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమైనది-ప్రధాని మోదీ ఆర్టికల్ 370 రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ ఏకత్వాన్ని సుప్రీం తీర్పు మరో సారి చాటి చెప్పిందని ప్రధాని మోదీ అన్నారు. By Manogna alamuru 11 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఆర్టికల్ 370 రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిపిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టివేయలేమని.. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాగంబద్ధమే అంటూ స్పష్టం చేసింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని.. ఆర్టికల్ 370 అనేది యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు మీద ప్రధాని మోదీ స్పందించారు. ఇదొక చారిత్రకమైన తీర్పు అంటూ పొగిడారు. ఇది జమ్మూ-కాశ్మీర్ ప్రజల ఆశలు, ప్రగతికి తోడ్పడుతుందని ప్రధాని అన్నారు. ఉన్నత న్యాయస్థానం చేసిన ప్రకటన భారతదేశ ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. సుప్రీం తీర్పుతో ఆర్టికల్ 370 వల్ల బాధలుపడిన వారిందరికీ విముక్తి లభిస్తుందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. Today's Supreme Court verdict on the abrogation of Article 370 is historic and constitutionally upholds the decision taken by the Parliament of India on 5th August 2019; it is a resounding declaration of hope, progress and unity for our sisters and brothers in Jammu, Kashmir and… — Narendra Modi (@narendramodi) December 11, 2023 Also Read:సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దును సమర్ధించింది.. అసలు ఈ ఆర్టికల్ ఏమిటో తెలుసా? ప్రధాని మోదీతో పాటూ కేంద్ర హోంమంత్రి అయిత్ షా కూడా సుప్రీం తీర్పు మీద స్పందించారు. సుప్రీం తీర్పుతో భారత సమగ్రత బలపడిందని చెప్పారు అమిత్ షా. జమ్మూ-కాశ్మీర్ ఎప్పుడూ మనదేనని..దానిని భారత్ నుంచి ఇంక ఎవ్వరూ విడదీయలేరని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు రుజువు చేసిందని అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. After the abrogation of #Article370, the rights of the poor and deprived have been restored, and separatism and stone pelting are now things of the past. The entire region now echoes with melodious music and cultural tourism. The bonds of unity have strengthened, and integrity… — Amit Shah (@AmitShah) December 11, 2023 I welcome the Honorable Supreme Court of India's verdict upholding the decision to abolish #Article370. On the 5th of August 2019, PM @narendramodi Ji took a visionary decision to abrogate #Article370. Since then peace and normalcy have returned to J&K. Growth and development… — Amit Shah (@AmitShah) December 11, 2023 ఇక మరో బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా కూడా సుప్రీంకోర్టు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూ-కాశ్మీర్ ను భారత్ లో చేర్చే చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి తాను ఇంకా కోట్లాది మంది భారతీయులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నామని నడ్డా అన్నారు. माननीय उच्चतम न्यायालय द्वारा धारा 370 के विषय में दिये गये फ़ैसले का भारतीय जनता पार्टी स्वागत करती है। उच्चतम न्यायालय की संवैधानिक पीठ ने धारा 370 और 35A को हटाने के लिए दिए गये निर्णय, उसकी प्रक्रिया और उद्देश्य को सही ठहराया है। माननीय प्रधानमंत्री @narendramodi जी की सरकार… — Jagat Prakash Nadda (@JPNadda) December 11, 2023 #modi #supreme-court #amith-shah #pm #jp-nadda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి