Pizza v/s Cool Drinks : చాలామంది వారంలో కనీసం రెండు, మూడుసార్లైనా తమకు నచ్చినవి ప్రత్యేకంగా తింటారు. నాన్‌వెజ్(Non-Veg), బిర్యానీ(Biryani), ఫాస్ట్‌ఫుడ్‌లు(Fast Foods) తీసుకుంటారు. ఇక భోజనం చేసిన తర్వాత కూల్ డ్రింక్స్(Cool Drinks) తాగితే అరుగుదలకు మంచిదని చాలామంది అనుకుంటారు. కానీ ఇవి అందుకు విరుద్ధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. షుగర్‌తో కూడిన కార్బోనేటెడ్ పానీయాలతో గ్యాస్ మరింత పేరుకుపోతుందని.. దానివల్ల కడుపుబ్బరం, వికారం పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.
Also Read: ఉదయాన్నే నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!
గుండె సంబంధిత ముప్పు
ముఖ్యంగా షుగర్‌తో నిండిన సోడాతో పిజ్జా(Pizza) కాంబినేషన్‌లో తీసుకుంటే దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. పిజ్జా, కూల్ డ్రింక్స్ కాంబినేషన్‌లో తీసుకుంటే ఎక్కువ క్యాలరీలతో అధిక బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. పిజ్జాలో రిఫైన్డ్ కార్బోహైడ్రెట్లు, సంతృప్త కొవ్వులు, సోడియం వల్ల బరువు పెరగడంతో పాటు గుండె సంబంధిత ముప్పు పెరుగుతుంది. కూల్‌డ్రింక్స్‌లో ఉండే యాడెడ్ షుగర్స్, క్యాలరీలు ఈ సమస్య తీవ్రతను మరితంగా పెంచుతాయి.
బీపీ కూడా పెరిగే ప్రమాదం
అయితే వీటిని ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం, టైప్ టూ డయాబెటీస్, అలాగే దంత సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. ఎక్కువ షుగర్‌తో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. పిజ్జా, కూల్‌డ్రింక్, సోడా కాంబినేషన్‌లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ లేకపోవడం వల్ల పోషకాహార సమస్యలు తలెత్తి రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అంతేకాదు పిజ్జాం, సోడాలో ఉండే సోడియం కంటెంట్ వల్ల వాటర్ రిటెన్షన్‌కు దారితీసి బీపీ పెరిగే ప్రమాదం కూడా పొంచి ఉంది.
Also Read: ఒక్కసారిగా మద్యం మానేస్తే ఏమవుతుందో తెలుసా?