Amit Shah: మళ్లీ అధికారం మాదే.. ఎన్నికలకు ముందే సీఏఏ అమలు : అమిత్ షా

మూడోసారి కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి అమిత్‌ షా అన్నారు. ప్రజలు బీజేపీకీ 370 సీట్లు.. మొత్తంగా ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయన్నారు. ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

New Update
Amit Shah: మళ్లీ అధికారం మాదే.. ఎన్నికలకు ముందే సీఏఏ అమలు : అమిత్ షా

ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలేకి వస్తుందని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 370 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు లోక్‌సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం ( సీఏఏ)ను అమలు చేసేందుకు సన్నాహాల చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేశాం... అందుకే ప్రజలు బీజేపీకీ 370 సీట్లు.. మొత్తంగా ఎన్డీయే కూటమికి 400 సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నానని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన ఇలా మాట్లాడారు.

Also Read:  దేశంలో పెరుగుతున్న ఖైదీల మరణాలు.. 2023లో 561 మంది బలి

రాహుల్‌కు ఆ అర్హత లేదు

అయితే రాష్ట్రీయ లోక్‌దళ్‌ (RLD), శిరోమణి అకాలీదళ్‌ (SAD) లాంటి ప్రాంతీయ పార్టీలు NDAలో చేరతాయా? అని ప్రశ్నించగా.. తాము కుటుంబ ప్రణాళికను నమ్ముతాం కానీ రాజకీయాల్లో కాదంటూ బదులిచ్చారు. మరిన్ని పార్టీలు ఎన్డీయేలో చేరతాయని పరోక్షంగా వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రపై కూడా ఆయన స్పందించారు. 1947లో దేశ విభజనకు కారణమైన ఆ పార్టీ నేతకు ఇలాంటి యాత్ర చేసే అర్హత లేదంటూ విమర్శించారు.

ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం

2014లో భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకుల నడుమ ఉందని.. అంతటా కుంభకోణాలే తప్ప విదేశీ పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఈ పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టామని.. ఇప్పుడు అవినీతి లేదని.. విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చాయని తెలిపారు. మరోవైపు రాముడు జన్మించిన ప్రాంతంలో రామమందిరాన్ని నిర్మిస్తారని దేశ ప్రజలు 500 ఏళ్ల పాటు నమ్మారని.. కానీ బుజ్జగింపు రాజకీయాల వల్ల ఇది ఆలస్యమైందని అసహనం వ్యక్తం చేశారు.

Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

#amit-shah #telugu-news #caa #lok-sabha-seats
Advertisment
తాజా కథనాలు