Why Do I Sleep So Late : ఈ రోజుల్లో ప్రజల జీవన శైలి మారిపోతోంది. తీసుకునే ఆహారం వల్ల, వ్యాయామం చేయకపోడం, శారీరక శ్రమ(Exercise) లేకపోవడం ఇలా అనేక కారణాల వల్ల అనారోగ్యానికి గురువుతున్నారు. ముఖ్యంగా ఈమధ్య గుండెపోటు సమస్యలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా చాలామంది అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చిన్న వయసులోనే కొంతమంది గుండెపోటుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నిద్రపోయే(Sleeping Habits) సమయాల్లో పలు మార్పులు చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని.. యూరోపియన్ హర్ట్ జర్నల్‌లో ప్రచూరించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇక వివరాల్లోకే.. తాజా అధ్యయనం ప్రకారం రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయేవారిలో గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
Also Read: ఆర్టికల్ 370పై నేడు సుప్రీం తీర్పు..ప్రతి ఒక్కరూ తీర్పును గౌరవించాల్సిందేనన్న బీజేపీ..!!
ఈ పరిశోధన కోసం దాదాపు 88 వేల మందిని పరిశీలించారు. అయితే ఇందులో 60 శాతం మంది మహిళల(Woman's) వయసు దాదాపు 61 ఏళ్లు ఉంది. వీళ్లలో రాత్రిపూట 10-11 గంటల లోపు నిద్రపోయే వారిలో గుండె సమస్యలు తక్కువగా ఉన్నాయని తేలింది. కానీ అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోయేవారిలో 24 శాతం ఎక్కువగా గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందని బయటపడింది. అందుకు రాత్రిపూట తొందరగా నిద్రపోవాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. అలాగే ప్రతిరోజూ 7-8 గంటలకు తగ్గకుండా.. అలాగే రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం మంచిదని సూచిస్తున్నారు.
Also Read: పాదాలలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి..గుండెపోటు సంకేతాలు కావొచ్చు..!!