/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/delhi-4-jpg.webp)
ఢిల్లీలో బాణా సంచా కాల్చకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆల్రెడీ గాలి కాలుష్యంతో బాధలు పడుతున్నారు బాబూ...కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ చాలా చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా బాణా సంచా మీద నిషేధం విధించింది. అయితే ఢిల్లీ వాసులు మాత్రం మీరు చెప్పేందేంటి..మేము వినేందిటి అనుకున్నారు. చక్కగా అన్ని నిషేధాలను పక్కనపెట్టేశారు...ఆదేశాలు పెడచెవిన పెట్టారు. చక్కగా దీపావళిని జరిపేసుకున్నారు. దీపావళి రోజు రాత్రి జనమంతా టపాసులు కాల్చడంతో ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఫలితంగా నగరం అంతటా విపరీతమైన కాలుష్యం ఏర్పడింది.
Also Read:మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..
టపాసుల కారణంగా ఢిల్లీలో దట్టమైన పొగ కమ్ముకుంది. విజిబులిటీ బాగా తగ్గిపోయింది. కొంచెం దూరంలో ఉన్నవి కూడా కనిపించడం లేదు. ఢిల్లీలోని లోధీ రోడ్, ఆర్కేపురం, కరోల్ బాగ్, పంజాబీ బాగ్ లలో టపాసులు విపరీతంగా కాల్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ప్రజలు దీపావళిని జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమే అయినా ఎయిర్ పొల్యూషన్ ను మరింత పెంచడమే చాలా బాధాకరంగా మారింది.
గత కొన్ని వారాలుగా ఢిల్లీ కాలుష్యంతో ఉక్కికిబిక్కిరి అవుతోంది. కాలుష్యం చాలాచోట్ల తీవ్రమైన కేటగిరీలో ఉంది. ఇప్పుడు దీపావళి వలన ఇది మరింత విపరీతం అవుతోంది. దేశ రాజధానిలో మరోసారి కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగాయి. ఇది స్థానికులను మరిన్ని ఇబ్బందులకు గురిచేయనుంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని నివారించడానికి కృత్రిమ వర్షం కురిపించాలని ఆలోచిస్తోంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇది తప్పనిసరి చేసే అవకాశం ఉంది.
#WATCH | People burst firecrackers in Delhi on the occasion of #Diwali
(Drone visuals, shot at 12:00 am) pic.twitter.com/rXE8NP80em
— ANI (@ANI) November 12, 2023
Also Read:ఆ ఏడు గ్రామాల్లో నిశ్శబ్దంగా దీపావళి పండుగ.. ఎందుకో తెలుసా ?..
Follow Us