AP Cabinet Meet : ఈ రోజు సీఎం జగన్(CM Jagan) అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో సీఎం జగన్ పెన్షన్ ను పెంచుతామని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచింది. ఆరోగ్య శ్రీ(Arogyasri) లో చికిత్స పరిమితి రూ.25 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. జనవరిలో వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్ట్ DPRకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కూడా ప్రారంభం కానున్నట్లు తెలిపింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ALSO READ: ఏపీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ దుర్మరణం.!
మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెల్సుకున్నారు సీఎం వైఎస్ జగన్. అనంతరం రోడ్డు ప్రమాదంలో సాబ్జీ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి, మంత్రివర్గం. సాబ్జీ మృతికి కేబినెట్ సంతాపం తెలిపింది. 2 నిమిషాలు మౌనం పాటించారు కేబినెట్ సభ్యులు.
సీఎం జగన్ తో కేంద్ర బృందం భేటీ
ఈ సాయంత్రం కేంద్ర బృందంతో సమావేశం కానున్నారు సీఎం వైఎస్ జగన్. మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది కేంద్ర బృందం. తుఫాన్ వల్ల కలిగిన నష్టం, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయక చర్యలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి సమాచారం సేకరించింది కేంద్ర బృందం. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో సమావేశమై తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై పలు కీలక నిర్ణయం తీసుకోనుంది.
Also Read : బర్రెలక్కకు వచ్చిన ఓట్లు పవన్ కు రాలేదు.. సీఎం జగన్ సెటైర్లు!