Chiranjeevi-Pawan Kalyan Video: చిరంజీవి ఇంటికి పవన్ కల్యాణ్.. ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసిన మెగా ఫ్యామిలీ! ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ తన భార్య పిల్లలతో కలిసి నేరుగా మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తొలిసారి వచ్చిన పవర్ స్టార్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 06 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Pawan Kalyan: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన నుంచి బరిలో ఉన్న అభ్యర్థులంతా ఘన విజయం సాధించారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బంపర్ మెజార్టీతో విజయం గెలిచి అడుగుపెట్టబోతున్నారు. దీంతో ఆయన కు డిప్యూటీ సీఎం పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ రోజు తన సోదరుడు చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవి కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ పై పూల వర్షం కురిపించింది మెగా ఫ్యామిలీ. పవర్ స్టార్ కు వదిన సురేఖ హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. కేక్ కట్ చేసి కుటుంబమంతా సంబరాలు చేసుకున్నారు. అన్న చిరంజీవి, తల్లి అంజనాదేవీ, వదిన సురేఖ పాదాలకు నమస్కారించి ఆశీర్వాదం తీసుకున్నారు పవర్ స్టార్. ఈ సందర్భంగా భావోద్వేగ వాతావరణం కనిపించింది. మెగా బ్రదర్ నాగబాబు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Mega Power ❤️🔥💥 pic.twitter.com/wV2dzEgtJL — Siddhu Manchikanti Potharaju (@SiDManchikanti) June 6, 2024 ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా పవర్ స్టార్ కు మెగా ఫ్యామిలీ అండగా నిలిచింది. పవన్ ను గెలిపించాలంటూ అనేక సార్లు మెగాస్టార్ పిలుపునిచ్చారు. నాగబాబు అయితే.. పవన్ కు వెన్నంటే ఉండి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. వరుణ్ తేజ్ పిఠాపురం వెళ్లి బాబాయ్ గెలుపు కోసం ప్రచారం చేశారు. ప్రచారం చివరి రోజు రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వెళ్లి పవర్ స్టార్ కు మద్దతు తెలిపారు. ఏది ఏమైనా పవర్ స్టార్ విజయాన్ని మెగా ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తోంది. #pawan-kalyan #chiranjeevi #janasena #pitapuram #politics #mla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి