Janasena Visits Visakhapatnam : గురువారం విశాఖ పట్నానికి జనసేన (Janasena)అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)రానున్నారు. నగరంలోని ఎస్.రాజా గ్రౌండ్స్ లో జనసేన బహిరంగ సభ జరగనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. పవన్ సమక్షంలో పలువురు వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు పార్టీలో చేరనున్నారు. రాష్ట్రంలో మిచౌంగ్ (Michaung) తుఫాన్ సృష్టించిన బీభత్సం గురించి , జరిగిన పంట నష్టం గురించి పవన్ ప్రస్తావించనున్నారు.
ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఆళ్వార్ దాస్ మైదానంలో ఏర్పాట్లు పూర్తి అయినట్లు స్థానిక జనసేన నేతలు వివరించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సభా ప్రాంగణానికి పవన్ చేరుకుంటారని సమాచారం. తుఫాన్ ప్రాంతాల్లో రైతుల సమస్యలు, ప్రభుత్వం వారికి కల్పించాల్సిన సౌకర్యాలు, అవసరాలను గురించి పవన్ ప్రసంగించనున్నారు.
సభ అనంతరం పార్టీ నాయకులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కాగా తుఫాన్ సమయంలో పవన్ పలు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో ఆయన ఏపీ పై మిచౌంగ్ తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణశాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఇది తీవ్ర తుఫాన్ అని రెడ్ అలెర్ట్ కూడా ఇచ్చారని పవన్ వెల్లడించారు. తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇదిలా ఉండగా.. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో వరి చేలను పరిశీలించిన ముమ్మిడివరం ఇన్ ఛార్జ్ పితాని బాలకృష్ణ, కార్యకర్తలు. ఈ క్రమంలోనే వారు రైతులతో మాట్లాడారు.
పంటలు నష్టపోయిన రైతులను అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు 25 వేల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కాలువలు, డ్రైన్లను ఆధునికరించకపోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలని ఆయన కోరారు.
స్థానిక ఎమ్మెల్యే కానీ, ప్రజా ప్రతినిధులు కానీ హైవే పై ఉన్న చేలను ఉరికే షికారుకు వచ్చి చూసి వెళ్లి పోయారని ఆయన ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు అన్ని ప్రాంతాలకు తిరిగి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కేవలం జనసేన అధినేత మాత్రమే తన సొంత డబ్బులతో రైతులను ఆదుకున్నారని ఆయన తెలిపారు. రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే జనసేన పార్టీ తరఫున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Also read: ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు!