/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/38-2-jpg.webp)
Janasena MLA Candidate: ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రకటించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తున్నట్టు తెలిపారు. కొన్ని గంటల్లోనే కొత్త అభ్యర్థి పేరు ప్రకటిస్తామని చెప్పారు. మరోవైపు ఈ రోజు అవనిగడ్డలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ (Buddha Prasad) పేరును అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. జనసేన నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు పవన్ కల్యాణ్.
ఇంతకు ముందే అభ్యర్ధి పేరు ఖరారు..
రైల్వే కోడూరు స్థానానికి జనసేన నుంచి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. అయితే ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు. మిత్ర పక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం అవడంతో రైల్వే కోడూరు అభ్యర్థి మార్పు మీద పునరాలోచన చేస్తున్నారు పవన్ . ఇక్కడ అభ్యర్థిని మార్చాలని నాయకులు కూడా తమ అభిప్రాయాలను తెలియచేశారు. దీంతో రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.
బుద్ధప్రసాద్‌కు లక్కీ ఛాన్స్
మరోవైపు అవనిగడ్డ శాసన సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్.. పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం బుద్ధప్రసాద్ పేరును ఖరారు చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో పాటూ పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరుపై రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తూ పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-04-at-12.19.53-PM-791x1024.webp)
Follow Us