Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరూ ఊహించనంతగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం దక్కించుకుంటోంది. ఆధిక్యంలో సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా పిఠాపురం అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలుసు సొంతం చేసుకుంటున్నారు. అసలు ఆంధ్రాలో కూటమి విజయానికి కూడా జనసేనానే బాటలు వేశారని అంటున్నారు. ఏపీలో ముందుగా టీడీపీ,జనసేన, బీజేపీ ఎవరికి వారు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే కలిసి పోటీ చేయాలని బలంగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్. ఓ దశలో బీజేపీ పొత్తుకు ఇష్టంగా లేకపోయినా.. పవన్ వారిని ఒప్పించాడు. బీజేపీ, టీడీపీ, జనసేనను ఒక తాటిపైకి తీసుకు వచ్చాడు. దాని ఫలితమే ఈరోజు ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీతో గెలుస్తోంది. దాంతో పాటూ జగన్‌ను ఓడిస్తానని జనసేనాని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. పిఠాపురంలో భారీ మెజారిటితో ఆయన గెలుపును దక్కించుకున్నారు. పవన్ కల్యాణ్ విజయానికి ఈ ఎన్నికల్లో కలిసి వచ్చిన అంశాలు ఇవే.
ఎన్నికల హడావుడి మొదలైన దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు.గత ఎన్నికల్లో పార్టీతో పాటు తాను ఘోర పరాజయం చెందినా..ఎక్కడా తగ్గలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయనంటూ చెప్పిన పవన్.. వ్యూహాత్మకంగా టీడీపీతో పొత్తుపెట్టుకున్నారు. దాంతో పాటూ టీడీపీ, బీజేపీలను ఒక్కతాటిపైకి తీసుకు వచ్చారు.
టీడీపీ, బీజేపీ పొత్తులో కీలక పాత్ర పోషించారు. ఇందుకోసం జనసేనకు కేటాయించిన సీట్లను కూడా ఆయన త్యాగం చేశారు. సొంతపార్టీలో నేతలు, కార్యకర్తలే తనను విమర్శించినా ఓపికగా భరించారు. వారికి సర్ది చెప్పుకుంటూ, బుజ్జగించుకుంటూ గెలుపు కోసం పాటు పడ్డారు. తట్టుకొని నిలబడ్డాడు. 21 సీట్లలో పోటీకి దిగిన జనసేన ఇప్పుడు దాదాపు 17 స్థానాల్లో గెలిచే పరిస్థితి నెలకొంది. ఇదంతా పవన్ పుణ్యమే అని చెప్పాలి. పదేళ్లుగా పదవి రాకపోయినా.. జనం గెలిపించకున్నా.. ఓపికతొ నిలబడ్డాడు. రాజకీయాలకు భయపడి పారిపోలేదు. అటు సినిమాలు చేస్తూనే… పాలిటిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు.
మరోవైపు గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జనసేనాని అక్కడితో రాజకీయాలను వదిలేయలేదు. తన లక్ష్యం పదవి కాదంని చెబుతూనే..పర్యటనలు, పోరాటాలతో సాధ్యమైనంత వరకు గత ఐదేళ్లలో ప్రజల్లోనే ఉన్నారు. పెద్దగా ట్టించుకోకపోయినా తాను అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రజలకు దగ్గరగా వెళ్ళి వారి అవసరాలు తెలుసుకుంటూ తన వంతు సహాయం లేదా మద్దతు ఇచ్చారు పవన్ కల్యాణ్. ఇది ప్రజల్లో ఆయన మీద నమ్మకం పెరిగేలా చేసింది.
ఇక చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో వెళ్లి ఆయనను కలిసి.. వెంటనే బయటకు వచ్చి జైలు బయటే టీడీపీతో పొత్తు ప్రకటించారు పవన్. దీంతో కష్టకాలంలో అండగా ఉన్నారంటూ టీడీపీ శ్రేణుల మనస్సు గెలుచుకున్నారు.దీంతో రెండు పార్టీల మధ్యా పొత్తు మరింత బలపడింది. ఇరు పార్టీల నేతలు మనస్ఫూర్తిగా ఒకరికొకరు కలిసి పని చేశారు. ప్రచారాల్లో కూడా వ్యాహాత్యకంగా ముందుకు వెళ్ళారు. ఇవన్నీ కూటమి విజయానికి దారులు వేశాయి. మరోవైపు ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్య లాంటి కాపు నేతలు ఎంత విమర్శించినా టీడీపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు విషయంలో ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అదే ఆయనకు ఇప్పుడు కలిసివచ్చింది.