Parliament: ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరిగేవి అప్పుడేనా..

డిసెంబర్ రెండో వారంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చాక కొద్ది రోజులకే ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే డిసెంబర్ 25 క్రిస్మస్ ముందే ఈ సమావేశాలు ముగుస్తాయని సమాచారం.

Parliament: ఐదు రాష్ట్రాల ఎన్నికలు..  పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరిగేవి అప్పుడేనా..
New Update

ఇటీవల పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పూర్తైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు శీతకాల సమావేశాలు రానున్నాయి. డిసెంబర్ రెండో వారంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈ నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మిజోరాంలో ఎన్నికలు పూర్తయ్యాయి. మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాక.. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే ఈ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అలాగే డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగకు ముందే ముగుస్తాయని పేర్కొన్నాయి.

Also Read: పొంగులేటి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు..

అయితే ఈ శీతాకాల సమావేశాల్లో కొత్త చట్టాలు ప్రవేశపెట్టనున్నారు. భారతీయ శిక్షాస్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధాల చట్టాల స్థానంలో స్టాండింగ్ కమిటీ ఇటీవలె ఆమోదించినటువంటి కొత్త చట్టాలు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు కూడా పార్లమెంటు వద్ద పెండింగ్‌లో ఉంది. వాస్తవానికి శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్‌ మూడోవారంలో ప్రారంభమై.. క్రిస్మస్ ముందు ముగిసిపోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాస్త ఆలస్యంగా ఈ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Also Read: సీఎం నితీష్‌ వ్యాఖ్యలపై మోదీ గరం.. గరం..!

#telugu-news #elections #national-news #parliament
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe