Big Breaking: పొంగులేటి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు.. మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం, హైదరాబాద్‌లోని ఆయన నివాసాల్లో ఉదయం 4 గంటల నుంచి ఐటీ రైడ్స్ ఏకకాలంలో జరుగుతున్నాయి.8 వాహనాల్లో వచ్చిన ఈడీ అధికారులు మూకుమ్మడిగా పొంగులేటి ఇంట్లోకి ప్రవేశించి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. By B Aravind 09 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని పొంగులేటికి చెందిన రాఘవ నిలయంలో ఉదయం 4 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రాఘవ నిలయంతో పాటుగా ఖమ్మం రూరల్‌లో క్యాంపు కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో కూడా నందగిరి హిల్స్‌లోని ఆయన నివాసంలో కూడా ఐటీ రైడ్స్ ఏకకాలంలో జరుగుతున్నాయి. 8 వాహనాల్లో వచ్చిన ఈడీ అధికారులు మూకుమ్మడిగా పొంగులేటి ఇంట్లోకి ప్రవేశించి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. . సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకొని మాజీమంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. Also read: రయ్..రయ్.. ఒక్క రోజే కేసీఆర్ రెండు చోట్ల నామినేషన్లు! కానీ లోపలికి ఐటీ అధికారులు తుమ్మలను అనుమతించలేదు. అయితే ఇటీవలే తనపై ఐటీ దాడులు జరుగుతాయంటూ పొంగులేటి ఆరోపించిన సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల్లో తన కుటుంబ సభ్యులపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో దోచుకున్న లక్ష కోట్లను ఖర్చు చేసి గెలవాలని బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ వేసిందంటూ విమర్శించారు. కానీ గెలవలేమని నిర్ణయానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారంటూ మండిపడ్డారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావును కేటీఆర్ టార్గెట్ చేశారని ఆరోపించారు. ఇదిలా ఉండగా మరో విషయం ఏంటంటే ఈరోజే పొంగులేటికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. #ponguleti-srinivas-reddy #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి