Pakistan - Iran: పాక్‌ మీద ఇరాన్ దాడులు..తీవ్రపరిణామాలు తప్పవంటున్న పాక్

పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో త్రీవ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. జైషే అల్ అదిల్ కు చెందిన రెండు ప్రధాన కార్యాలయాల మీద డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఈ దాడులను పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోంది. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తోంది.

Pakistan - Iran: పాక్‌ మీద ఇరాన్ దాడులు..తీవ్రపరిణామాలు తప్పవంటున్న పాక్
New Update

Iran Attack on Pakistan: తీవ్రవాదం, ఉగ్రవాదాలపై ఉక్కుపాదం మోపుతోంది ఇరాన్. తమ బలగాలపై దాడులుచేస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టాలని ప్రయత్నిస్తోంది. క్షిపణులతో (Missiles) దాడులు చేస్తోంది. సిరియా, ఇరాక్‌లలో దాడు చేసింది. వీటి తరువాత పాకిస్తాన్ మీద కూడా తన గురి ఎక్కుపెట్టింది ఇరాన్. పాకిస్తాన్‌లో బలూచిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాల మీద క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేసింది. తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడి చేశామని..ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. పాక్ సరిహద్దు వెంట తమ బలగాలపై దాడులు చేసిన ఉగ్రవాద గ్రూప్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపింది.

Also read:ఫైబర్‌ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ

తీవ్ర పరిణామాలు తప్పవు...

అయితే ఈ దాడులను పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి చర్యలకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తోంది. ఇరాన్ చేసిన దాడుల్లో ఇద్దరు పిల్లలు చనిపోయారని (Two Children Killed)...మరో ముగ్గురు తీవ్ర గాయాలు పాలయ్యారని తెలిపింది. ఇరాన్ చర్యలను ఖండిస్తూ ఆ దేశ రాయబారిని పిలిచి మరీ ఈ విషయాన్ని చెప్పింది పాకిస్తాన్ ప్రభుత్వం. తమ దేశ సార్వభౌమాధికారాన్నే సవాల్ చేశారని అంటోంది. పాక్ గగనతలాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించింది.

ఇది కచ్చితంగా రెండు దేశాలకూ మంచిది కాదు...

పాక్, ఇరాన్ దేశాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి కొన్ని మార్గాలు ఏర్పాటు చేసుకున్నామని...వాటిని ఇరాన్ ఉల్లంఘిస్తోందని పాకిస్థాన్‌ (Paksitan) అంటోంది.. వాటిని కాదని.. ఇరాన్‌ ఇలా దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. అయితే దాడులు సరిగ్గా ఎక్కడ జరిగాయనే విషయాన్ని మాత్రం పాక్ చెప్పడం లేదు. ఉగ్రవాదం వల్ల అన్ని దేశాలకూ ముప్పుందన్న విషయాన్ని తామూ అంగీకరిస్తామని...కానీ దానిని అంతమొందించడానికి అన్ని దేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని చెబుతోంది. కానీ ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించింది. ఈ దాడులతో తమ ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను ఇరాన్ (Iran) దెబ్బతినేలా చేసిందని పాక్‌ మండిపడింది.

#pakistan #iran #terrorists #attacks
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe