పాక్ బృందానికి వరల్డ్ కప్ లో ఆడటానికి భారత్ ఎంట్రీ ఇచ్చింది. లాస్ట్ మినిట్ వరకూ వీసాలు రాక ఏం చేయాలో తెలిక తికమక పడుతున్న పాక్ ఆటగాళ్ళు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. మరో పది రోజుల్లో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ మొదలవబోతోంది. భారత్ వేదిక గా జరుగుతున్న ఈ ప్రపంచకప్ కోసం ఇప్పటికే అన్ని దేవాలు భారత్ కు చేరుకుంటున్నాయి. పాక్ కూడా మరో 48 గంట్లోల ఇండియా రానుంది. కానీ సోయవారం సాయంత్రం వరకూ పాక్ ఆటగాళ్ళకు వీసాలు రాలదు. మరో 48 గంటల్లో భారతదేశానికి బయల్దేరాల్సి ఉండగా ఇంకా వీసాలు రాకపోవడంత మీద పాక్ బోర్డు అసంతృప్తి వెల్లడించింది. సోమవారం ఉదయం ఈ విషయం మీద పాక్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. చివరకు సాయంత్రానికి అన్నీ సర్దుకున్నాయి. పాకిస్తాన్ టీమ్ భారత్ రావడానికి వీసాలు మంజూరు అయ్యాయని ఐసీసీ నిర్ధారించింది.
మొదట నుంచీ భారత్, పాక్ లు కొట్టుకుంటున్నాయి. ఆసియా కప్ పాకిస్తాన్ లో ఉంటే భారత్ వెళ్ళనంది. అలా అయితే వరలడ్ కప్ కు మేము కూడా రామని పాకిస్తాన్ అంది. తర్వాత వ్యవహారం చక్కబడింది. ఆసియాకప్ పాకిస్తాన్లో జరగాల్సిన మ్యాచ్ లను శ్రీలంకకు తరలించారు. వరల్డ్ కప్ ఆడ్డానికి పాక్ కూడా భారత్ కు రావడానికి అంగీకరించింది. కానీ చివర వరకు పాక్ ఆటగాళ్ళకు భారత్ వీసాల మంజూరు కాకపోవడంతో కాస్త టెన్షన్ నెలకొంది. దీని వలన ఆ జట్టు దుబాయ్ లో రెండు రోజుల పాటూ ప్రత్యేక శిక్షణా శిబిరానికి వెళ్ళాలనుకుంది. వీసా సమస్య వలన దానిని కాన్సిల్ చేసుకోవలసి వచ్చింది. కొత్త షెడ్యూల్ ప్రకార్ బుధవారం తెల్లవారుఝామున లోహోర్ నుంచి దుబాయ్ మీదుగా పాక్ టీమ్ భారత్ లోని హైదరాబాద్ కు చేరుకుంటుంది. శుక్రవారం పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ తో మొదటి వార్మప్ మ్యాచ్ ఆడుతుంది.
అక్టోబర్ 5 నుంచి క్రికెట్ వన్డే వరల్డ్ కప్ మొదలవనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ లు మొదటి మ్యాచ్ ను ఆడనున్నాయి. నవంబర్ 19 వరకు భారత్ అంతటా వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. చివరి ఫైనల్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనుంది. వరల్డ్ కప్ లో భారత్ ఫైవరెట్ గా ఉంది. వరుసగా ఆసియా కప్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లలో గెలుస్తూ తమ సత్తాను చాటుకుంటున్నారు టీమ్ ఇండియా ఆటగాళ్ళు. దీంతో భారత్ కు ట్రోఫీ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.