Pakistan : తొలిసారిగా చంద్రునిపై రాకెట్‌ను ప్రయోగించిన పాకిస్థాన్ పాకిస్థాన్ తొలిసారిగా చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే నింగిలోకి పేలోడ్స్‌ను విజయవంతంగా పంపించింది. ఈ ప్రయోగానికి మిత్ర దేశం చైనా సహాయం చేసింది. ఈ లూనార్ మిషన్‌కు పాకిస్థాన్.. ఐక్యూబ్-కమర్ అని పేరు పెట్టింది By B Aravind 04 May 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Lunar Mission : పాకిస్థాన్(Pakistan) ఎట్టకేలకు చంద్రుని(Moon) పై పరిశోధనలకు సిద్ధమైంది. విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించింది. తొలి ప్రయత్నంలోనే నింగిలోకి పేలోడ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా పంపించింది. పాకిస్థాన్ చరిత్రలో చంద్రునిపై పరిశోధనలు చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ ప్రయోగానికి మిత్ర దేశం చైనా సహాయం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ(Institute Of Space Technology) తో కలిసి ఈ పేలోడ్స్‌ను రూపొందించింది. అయితే ఈ లూనార్ మిషన్‌కు పాకిస్థాన్.. ఐక్యూబ్-కమర్ అని పేరు పెట్టింది. పాకిస్థాన్ ఉపగ్రహం ఐక్యూబ్ క్యూ, చైనా శాటిలైట్ చాంగ్ ఇ-6 ప్రోబోను జాబిల్లి పైకి చేర్చేందుకు లాంగ్ మార్చ్-5 వై9 రాకెట్‌ను ఉపయోగించారు. Also Read: పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత! చైనా(China) లోని హైనన్ ఐలాండ్స్‌లో గల వెంఛెంగ్ స్పేస్ లాంచింగ్ స్పేస్ లాంచింగ్ సెంటర్ నుంచి శుక్రవారం రాత్రి 9.27 PM నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ఐక్యూబ్ కమర్ శాటిలైట్.. ప్రయోగించిన తేదీ నుంచి 5 రోజుల తర్వాత చంద్రుని కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఈ పేలోడ్ చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అవుతుంది. 48 గంటల పాటు తవ్వకాలు జరుపుతుంది. అనంతరం రెండు కేజీల బరువు ఉండే చంద్రడి ధూళి, మట్టి శిలలను తీసుకొని మళ్లీ భూమిపైకి తిరిగొస్తుంది. మంగోలియాలో ఇవి ల్యాండ్ అయ్యేలా ప్రొగ్రామ్స్ చేశారు శాస్త్రవేత్తలు. ఇక పాకిస్థాన్‌కు చెందిన ఐక్యూబ్ కమర్‌తో సహా.. రాడాన్ డిటెక్టర్- ఫ్రాన్స్, లూనార్ సర్ఫేస్ నెగెటివ్ అయాన్ అనలైజర్- యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, లేజర్ యాంగిల్ రిఫ్లెక్టర్- ఇటలీ పేలోడ్స్‌ను కూడా లాంగ్ మార్చ్-5 వై8 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఆ తర్వాత వీటిని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపడుతుంది. పాకిస్థాన్ చంద్రునిపైకి మొదటిసారిగా రాకెట్‌ను ప్రయోగించడంతో.. ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రయోగంలో ఇదొక మైలురాయిగా అభివర్ణించారు. Also read: ఈ దేశంలో డిజిటల్, రవాణా పూర్తిగా ఉచితం.. ఎక్కడంటే ? #lunar-mission #china #moon #pakistan #telugu-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి