Pakistan: అవును కార్గిల్ యుద్ధం చేశాం..ఒప్పుకున్న పాకిస్తాన్

పాతికేళ్ళ తర్వాత పాకిస్తాన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకుంది. కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొన్నామని ఆ దేశ సైన్యాధిపతి బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఇన్నాళ్ళూ తమకు ఏ పాపం తెలియదు అంటూ నాటకాలాడిన పాక్ ఓటమి గుట్టు రట్టయ్యింది.

Pakistan: అవును కార్గిల్ యుద్ధం చేశాం..ఒప్పుకున్న పాకిస్తాన్
New Update

Kargil War: సరిగ్గా పాతికేళ్ళ క్రితం భారత్‌లోకి చొరబడి ఇక్కడ భూభాగాన్ని ఆక్రమించాలని చూసింది భారత్. దాన్ని మన దేశ ఆర్మీ ఎంతో ధైర్యంగా తిప్పి కొట్టింది. ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ లో యుద్ధం చేసి మరీ పాక్ సైన్యాన్ని తరిమి కొట్టింది. అయితే ఇన్నాళ్ళూ పాకిస్తాన్ మాత్రం తాము యుద్ధం చేయలేదని బుకాయిస్తూ వచ్చింది. ముజాహిదీన్‌లు లేదా కశ్మీరీ తిరుగుబాటుదారులే ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము పెట్రోలింగ్‌ మాత్రమే చేశామని చెప్పింది. భారత్.. పాక్ సైన్యం పాత్రను ఆధారాలతో సహా చాలా సార్లు బయటపెట్టింది. ముజాహిదీన్‌లు లేదా కశ్మీరీ తిరుగుబాటుదారులే ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము పెట్రోలింగ్‌ మాత్రమే చేశామని చెప్పింది. కానీ వాటన్నింటినీ పాక్ కొట్టి పారేస్తూ వచ్చింది. దాన్ని కానీ ఇప్పుడు చివరకు నిజాన్ని ఒప్పుకుంది. సాక్షాత్తు ఆదేశ సైన్యాధిపతే యుద్ధంలో తమ పాత్రను అంగీకరించడంతో పాటూ ఓటమిని అంగీకరించింది.

పాకిస్తాన్‌లో రావల్పిండలో పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో నిన్న డిపెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఇందులో పాక్ ఆర్మీ జనరల్ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మాట్లాఆరు ఇందులో ఆయన భారత్‌, పాకిస్థాన్‌ మధ్య 1948, 1965, 1971, కార్గిల్ యుద్ధం, సియాచిన్‌ ఘర్షణల్లో వేలాది మంది మన సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చిందని అన్నారు. దీంతో కార్గిల్‌ యుద్ధంలో పాక్‌ సైన్ పాత్ర బటకు వచ్చినట్లు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతే కాకుండా పాక్ ఓటమి విషయం కూడా బయటపడింది.

1999 మే– జూలై మధ్య ఇండయా, పాక్ ల మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ఆపరేషన్ విజయ్ పేరుతో భారత్ సైన్యం పాక్ ను హడలెత్తించింది. జూలై 26న పాక్ సైన్యాన్ని తరిమికొట్టినట్టు భారత ఆర్మీ ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతీ ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ ను నిర్వహించుకుంటున్నాం. యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న అమర వీరులను తలుచుకుంటున్నాం.

Also Read: Delhi: ఐఏఎస్ నుంచి పూజా ఖేద్కర్ తొలగింపు

#pakistan #army #kargil-war #india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి