చైనా గుర్తులు వేస్తే..ఆక్రమించినట్టేనా– కిరణ్ రిజిజు

అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైన్యం చొరబడడమే కాకుండా కొన్ని గుర్తులను వేసి...ఆ ప్రాంతాన్ని తాము ఆక్రమించుకున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఏవో కొన్ని గుర్తులు వేసినంత మాత్రాన ఆ ప్రాంతం ఆక్రమణకు గురైనట్లు కాదని స్పష్టం చేశారు.

New Update
చైనా గుర్తులు వేస్తే..ఆక్రమించినట్టేనా– కిరణ్ రిజిజు

India-China: రోజురోజుకూ చైనా హద్దులు మీరుతోంది. మన దేశంలోకి చొరబడ్డమే కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ మీ వింత వింత వాదనలు వినిపిస్తూనే ఉంటుంది చైనా. అరుణాచల్ తమదే నని చాలా సార్లు ప్రకటించింది ఆ దేశం. అది తమ భూభాగంలోనే ఉందని వితండ వాదనలు చేస్తూనే ఉంది. రీసెంట్‌గా అక్కడ ఆక్రమణలకు పాల్పడిందన్న వార్తలు వినిపించాయి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోకి చైనా సైనయం చొరబడి..పెయింగ్ గుర్తులు వేసిందని తెలుస్తోంది. దీని మీద కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు.

కేవలం పెయింటింగ్‌ గుర్తులు వేసినంత మాత్రాన ఆ ప్రాంతం ఆక్రమణకు గురైనట్లు కాదన్నారు. చైనా మన భూభాగాన్ని తీసుకోలేదు. ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో చౌనా సైన్యం ఒక్కోసారి పరిధిని మించి లోపలికి వస్తున్నాయన్న మాట నిజమే. కానీ అంతకు మించి వారు ఏమీ చేయలేరు. అరుణాచల్‌లో శాశ్వత నిర్మాణాలను చేపట్టడం కుదరదు. మన వైపు నుంచి గట్టి నిఘా ఉంది. ఏవో కొన్ని గుర్తులు వేసి ఆక్రమించేశాము అంటే వరు ఒప్పుకుంటారని కిరణ్ రిజిజు అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మన సైనయం గట్ట నిఘా చేస్తోంది. వాస్తవాధీన రేఖ సమీపానికి ఎవ్వరినీ రానీయమని అని కేంద్రమత్రి స్పష్టం చేశారు.

Also Read: Ukraine: భారత్‌లో జెలెన్‌స్కీ పర్యటన..

Advertisment
తాజా కథనాలు