Andhra Pradesh: అవయవ దానం చేస్తే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.. అవయవ దానం చేసిన పార్ధివ దేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇలా జీవ దాతలుగా నిలిచిన వారికి గౌరవంగా వీడ్కోలు పలకడంతో పాటు వారి కుటుంబాలకు రూ.10 వేల పారితోషికాన్ని కూడా అందజేయనున్నారు. By B Aravind 09 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి AP Government: అవయవ దానం చేసిన పార్ధివ దేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇలా జీవ దాతలుగా నిలిచిన వారికి గౌరవంగా వీడ్కోలు పలుకాలని అలాగే వారి కుటుంబాలకు రూ.10 వేల పారితోషికాన్ని కూడా అందజేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచనలు చేసింది. వీటికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను వివరిస్తూ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్ లేదా ఎస్పీ అంత్యక్రియలకు హాజరయ్యేలా ఆదేశాలిస్తామని మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. Also Read: ఎద్దుల పందెంలో అపశృతి.. యువకుడిని పొడిచి చంపిన బాహుబలి ఎద్దు! అవయవ దానం చేసే భౌతిక కాయాలకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు నిర్వహించడం కోసం కేంద్రం ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.10 వేల పారితోషికాన్ని మంజూరు చేసిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అలాగే జీవదాతల కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తూ వారిని శాలువా, ప్రశంసాపత్రం, పుష్ఫగుచ్ఛాలతో సత్కరించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి భౌతిక శరీరం నుంచి అవయవాలను జిల్లా ఆసుపత్రి లేదా ప్రైవేటు ఆసుపత్రి ప్రధానాధికారి నుంచి తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ బాధితుల కుటుంబ సభ్య మాచారాన్ని అందజేయాలని తెలిపారు. అనంతరం ఆ భౌతికకాయాన్ని సరైన సమయంలో గౌరవప్రదంగా అంతిమ సంస్కరణలు చేయాలని సూచించారు. అయవవ దాతల కుటుంబాలకు ప్రశంసాపత్రాన్ని ఇచ్చి.. జ్ఞాపికను కూడా అందించాలని తెలిపారు. అవయవ సేకరణ తర్వాత ఆసుపత్రి నుంచి దాత నివాసం వరకు లేదా స్మశాన వాటిక వరకు భౌతికకాయాన్ని ఉచితంగా తరలించేలా ఏర్పాటు చేయాలన్నారు. ఆ తర్వాత అవయవ దాతకు సంబంధించిన ఫొటోతో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో జిల్లా కలెక్టర్ పత్రికా ప్రకటన విడుదల చేయాలని సూచించారు. Also Read: జగన్ కు మరో చిక్కు . .వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం! #andhra-pradesh #ap-news #ap-government #last-rites #organ-donors మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి