Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు

సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య ఇప్పటికే ఒక వందే బారత్ రైలు నడుస్తోంది. ఇప్పుడు మరో ట్రైన్‌ను ప్రారఃబించబోతున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి వందే బారత్ రైలును ప్రారంభించనున్నారు.

New Update
Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు

Secunderabad To Visakhapatnam: సికింద్రాబాద్‌- విశాఖల మధ్య మరో ట్రైన్ వచ్చేస్తోంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ఇప్పటికే చాలా రైళ్ళు నడుస్తున్నాయి. ఇవి కాక కొంతకాలం క్రితం హైస్పీడ్ ట్రైన్ వందే భారత్‌ను కూడా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఇంకో వందే భారత్‌ను (Vande Bharat Express) కూడా ప్రారంభించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో నడుస్తోంది. దీని రష్ తగ్గించడానికే ఇప్పుడు మరో వందే భారత్ రైలును తీసుకురానున్నారు. ఈ ట్రైన్‌ను రేపు ప్రధాని మోదీ (PM Modi) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇంతకు ముందు ట్రైన్‌లానే ఇది కూడా అవే స్టాపేజ్‌లలో...అదే మార్గంలో ప్రయాణించనుంది.

విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు కొత్త వందే భారత్ ట్రైన్ మార్చి 13 నుండి ప్రారంభం కానుండగా.. తిరుగు ప్రయాణంలోనూ సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు 15 వ తేదీ శుక్రవారం నుండి ప్రారంభమవుతాయి. వీటికి టిక్కెట్ల బుకింగ్స్ మార్చి 12 నుండి అందుబాటులోఉంటాయి. రైలు నంబర్ 20707 సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ నుండి ఉదయం 05.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అటువైపు నుంచి రైలు నంబర్ 20708 విశాఖ నుంచి వందేభారత్ రైలు 14.35 గంటలకు బయలుదేరి రాత్రి 11.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈరైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఏడు ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్‌ కోచ్ ఉంటాయి. మొత్తం 350 మంది ఈ ట్రైన్‌లో ప్రయాణించవచ్చును.

Also Read: Chiranjeevi: విశ్వంభర సెట్స్‌ లో త్రిషకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన మెగాస్టార్‌!

Advertisment
తాజా కథనాలు