Chiranjeevi: విశ్వంభర సెట్స్ లో త్రిషకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్! చిరంజీవి, త్రిష 18 సంవత్సరాల తరువాత కలిసి నటిస్తున్నచిత్రం విశ్వంభర. ఈ చిత్ర సెట్స్ లోకి త్రిష రావడంతో ఆమెకు చిరంజీవి టెంపరేచర్ కంట్రోల్డ్ మగ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 11 Mar 2024 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి Viswambhara: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం విశ్వంభర ( Viswambhara)... సోషియో ఫాంటసీ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం భావిస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. చాలా సంవత్సరాల తరువాత త్రిష(Trisha) చిరంజీవి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు కూడా చిరు-త్రిష కాంబో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ని లాంఛనంగా ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితమే త్రిష కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఈ క్రమంలో సెట్స్ లోకి వచ్చిన త్రిషకి మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ గిఫ్ట్ (Gift) ఇచ్చారని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో ఈ విషయం కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.దీంతో ఈ విషయం గురించి త్రిష కూడా స్పందించింది. ఖరీదైన టెంపరేచర్ కంట్రోల్డ్ మగ్ ని తనకి మెగాస్టార్ గిఫ్ట్‌గా ఇచ్చారని అది చాలా బాగా నచ్చిందని ..అందుకు ప్రత్యేక కృతజ్ఙతలు అని కూడా తెలిపింది. ఈ విషయాన్ని కూడా అభిమానులు నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన విశ్వంభర సినిమా టైటిల్ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. Also read: మా నాన్న దర్శకత్వంలో అసలు నటించను..పూరి కొడుకు సంచలన కామెంట్స్! #trisha #gift #kiravani #viswambhara #chiranjeevi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి