Adipurush Trolling : ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు రావడం అంటే ఇదే. హనుమాన్(Hanu-Man) సినిమా హిట్ అవడం ఏమో కానీ మధ్యలో ఆదిపురుష్(Adipurush) సినిమా మీద విపరీతంగా ట్రోలింగ్ అవుతోంది. ఆ మూవీ డైరెక్టర్ ఓం రౌతును అయితే జనాలు ఓ లెవల్లో ఆడేసుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే...హనుమాన్ సినిమా నిన్న విడుదల అయింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ అద్భుతంగా ఉందని టాక్ వచ్చింది. గ్రాఫిక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కేవలం 25 కోట్లలో మూవీని చాలా గొప్పగా తీశాడని చెప్పుకుంటున్నారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ప్రశాంత్ వర్మ(Prashanth Varma) ను చూసి నేర్చుకోవాలని చెబుతున్నారు. రాజమౌళి లాంటి వారిని కూడా వదలడం లేదు. అంత తక్కువ బడ్జెట్‌లో హాలీవుడ్ లెవల్ గ్రాఫిక్స్ తీశాడంటే భయ్యా...మాటల్లేవ్ అని చెబుతున్నారు.
Also read:కొత్త ఆవకాయలా ఇంటిల్లిపాదీ మెచ్చే సూపర్ హీరో హను-మాన్!
ఇప్పుడు ఈ టాకే ఆదిపురుష్ టీమ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఆదిపురుష్ మూవీకి ఓం రౌతు(Om Raut) వందకోట్లు ఖర్చుపెట్టాడు. పోనీ సినిమా ఏమైనా బావుందా అంటే...పరమ దరిద్రంగా ఉంది. చిన్న పిల్లలు కూడా ఆ గ్రాఫిక్స్ చూసి పడీపడీ నవ్వుకున్నారు. కానీ హనుమాన్ సినిమాకు 25 కోట్లే ఖర్చు పెట్టారు. వీఎఫ్ఎక్స్ పీక్స్‌లో ఉన్నాయి. అందుకే అందరూ ఓం రౌతుకు సలహాలు ఇస్తున్నారు. భయ్యా సినిమా ఎలా తీయాలో ప్రశాంత్ వర్మను చూసి నేర్చుకో అంటూ క్లాసులు పీకుతున్నారు.
హనుమాన్ సినిమాకు పెట్టింది ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు. కానీ వచ్చింది మాత్రం వంద కోట్లకు పైగా ఉంటుంది. ఇంత తక్కువ బడ్జెట్ అంత క్వాలిటీని ఎలా రాబట్టుకున్నాడో ప్రశాంత్ వర్మ నుంచి అంతా నేర్చుకోవాలని అంటున్నారు. ఇది టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) మేకర్లు తెలుసుకోవాల్సిన విషయం అని, ఇదొక గైడెన్స్‌లా నిలిచిపోతుందని, అంతా ప్రశాంత్ వర్మ వద్ద నేర్చుకోవాల్సిన విషయమని నెటిజన్లు అంటున్నారు.