Hanuman Review: సినిమా ఎందుకు చూస్తారు? ఈ ప్రశ్నకు అందరూ చెప్పే సమాధానం వినోదం కోసం. కానీ, అన్నీ సినిమాలూ వినోదాన్ని పంచుతాయా? కచ్చితంగా ఔను అని చెప్పలేం. అసలు వినోదం అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే.. దానికి సమాధానం మాత్రం వ్యక్తులను బట్టి మారిపోతుంది. అందుకే అన్నీ సినిమాలు అందరికీ నచ్చవు. ఇది పిల్లల సినిమా.. అది పెద్దల సినిమా.. అబ్బా ఏమి కామెడీ సినిమా ఆండీ బాబూ.. ఈ సినిమాలో యాక్షన్ అదిరిందండీ.. ఇలా ఒక్కొరూ ఒక్కోరకంగా సినిమా వినోదానికి భాష్యం చెబుతారు. కానీ, ఒక్కోసారి వస్తాయి.. వీటన్నిటినీ సమానంగా కలిపి.. పిల్లా పాపాలతో సహా.. ఇంటిల్లిపాదినీ కుర్చీల్లో కట్టిపాడేసి రెండున్నర గంటల పాటు ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే సినిమాలు. హీరో.. హీరోయిన్.. స్టార్ డమ్.. ఇంకొరకమైన దమ్ము ఇలాంటివి ఏమీ లేకుండా.. వస్తాయి. అదిగో సరిగ్గా అలాంటి సినిమా.. సంక్రాంతికి మూడు రోజుల ముందుగానే థియేటర్లలో ప్రేక్షకులు పండగ చేసుకునేలా.. వచ్చేసింది హనుమాన్.(Hanuman Review)
పూర్తిగా చదవండి..Hanuman Review: కొత్త ఆవకాయలా ఇంటిల్లిపాదీ మెచ్చే సూపర్ హీరో హను-మాన్!
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో.. తేజా సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా పిల్లల దగ్గర నుంచి పెద్దలవరకూ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. సినిమాకి సమబంధించిన పూర్తి రివ్యూ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి
Translate this News: