Obesity : ఊబకాయం ఉన్నవారికి బ్లడ్ క్యాన్సర్ వస్తుందా?

ఊబకాయం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరగడం వల్ల మధుమేహంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జాగింగ్ లేదా రన్నింగ్ చేస్తే ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అశ్రద్ధ చేస్తే శరీరంలో అనేక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

Obesity : ఊబకాయం ఉన్నవారికి బ్లడ్ క్యాన్సర్ వస్తుందా?
New Update

Blood Cancer : ఊబకాయం(Obesity) ఉన్నవారిలో 70 శాతం రక్త క్యాన్సర్(Blood Cancer) వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఊబకాయం వల్ల అనేక ఆనారోగ్య సమస్యలు(Health Diseases) వస్తాయి. శరీరంలో కొవ్వు(Cholesterol) శాతం పెరగడం వల్ల మధుమేహంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు(Heart Diseases) వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. స్థూలకాయంతో బాధపడేవారిలో మోనోక్లోనల్ గామోపతి ఆఫ్ అన్‌డెటర్మినెడ్ ఇంపార్టెన్స్ సమస్య పెరుగుతుంది. దీనిని అశ్రద్ధ చేస్తే శరీరంలో అనేక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

ప్రమాదం 70 శాతం పెరుగుతుంది:

ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులలో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 70 శాతం పెరుగుతుంది. 2,628 మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో మైలోమా ప్రమాదం ఊబకాయం ఉన్నవారిలో 73 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు. సాధారణ బరువు ఉన్నవారిలో ఈ ప్రమాదం ఊబకాయం ఉన్నవారి కంటే చాలా తక్కువగా ఉంటుంది. 45 నుంచి 60 నిమిషాల పాటు జాగింగ్ లేదా రన్నింగ్ చేస్తే ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా చెడు జీవనశైలి కూడా ఈ వ్యాధికి కారణమని నిపుణులు అంటున్నారు.

Also Read : మార్చి 6 నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తులు..ఆన్‌లైన్ ఫైలింగ్ మీద కీలక అప్‌డేట్

మల్టిపుల్ మైలోమా అంటే? :

వాస్తవానికి మల్టిపుల్ మైలోమా అనేది ఒక రకమైన రక్త క్యాన్సర్. ఇది తెల్ల రక్త కణాలలో అభివృద్ధి చెందుతుంది. ఈ క్యాన్సర్ సంభవించినప్పుడు క్యాన్సర్ ఆధారిత ప్లాస్మా కణాలు ఎముక మజ్జలో పేరుకుపోవడం ప్రారంభిస్తాయి. ప్లాస్మా కణాలు ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సూక్ష్మక్రిముల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఈ క్యాన్సర్ వ్యాధి నిరోధక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమస్య సాధారణ ప్లాస్మా నుంచి మొదలై బోన్ మ్యారో వరకు వ్యాపిస్తుంది.

రక్త క్యాన్సర్‌ను నివారించే మార్గాలు:

బ్లడ్ క్యాన్సర్‌ను నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా, ప్రాణాయామం చేయడం వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుంది.
ధూమపానం, మద్యం సేవించే అలవాటును మానుకోవాలి.
కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
బ్లడ్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

ఇది కూడా చదవండి:మధుమేహాన్ని నోని పండు తగ్గించలేదా?.. వైద్యులు ఏమంటున్నారు?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#obesity #cholesterol #heart-diseases #blood-cancer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe