NFHS: భారత్‌కు ఒబేసిటీ ముప్పు.. ఆర్థిక సర్వే సంచలన రిపోర్ట్!

కరోనా, లాక్ డౌన్ తర్వాత భారత దేశంలో ఒబేసిటీ గణనీయంగా పెరిగినట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. ఢిల్లీ, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో నిలవగా.. పురుషుల కంటే మహిళలే అధికంగా ఊబకాయంతో బాధపడుతున్నట్లు సర్వే తేల్చింది.

New Update
NFHS: భారత్‌కు ఒబేసిటీ ముప్పు.. ఆర్థిక సర్వే సంచలన రిపోర్ట్!

Economic Survey 2024 : ఇండియాలో ఒబేసిటీ (Obesity) భారీగా పెరుగుతున్నట్లు ఆర్థిక సర్వే 2024 వెల్లడించింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS-5) ప్రకారం దేశంలో సగటున 22.9 శాతం మగాళ్లు స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలిపింది. గతంలో ఇది 18.9 శాతంగా ఉండగా ఈ ఏడాది ఏకంగా 4 శాతం పెరిగినట్లు పేర్కొంది. ఈ మేరకు 18- 69 ఏళ్ల వయసున్న వారిపై చేపట్టిన సర్వేలో.. మహిళల్లోనూ స్థూలకాయం సగటు 20.6 శాతంగా ఉండగా.. ఇప్పుడు 24 శాతానికి పెరిగినట్లు స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Telangana Farmers: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ స్కీమ్ కు అప్లై చేసుకున్నారా?

పురుషుల కంటే మహిళలే అధికంగా..
అయితే ఈ లెక్కల ప్రకారం పురుషుల కంటే మహిళలే అధికంగా ఊబకాయంతో బాధపడుతున్నట్లు సర్వే తేల్చింది. ఇక స్థూలకాయంతో బాధపడుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలివగా రెండో స్థానంలో తమిళనాడు ఉంది. ఢిల్లీకి చెందిన మహిళల్లో ఒబేసిటీ 41.3 శాతం ఉండగా పురుషుల్లో 38 శాతం ఉంది. తమిళనాడులో 37 శాతం పురుషులు, 40.4 శాతం మహిళల్లో స్థూలకాయంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మహిళలు 36.3 శాతం, పురుషులు 31.1 శాతం ఒబెసిటీతో బాధపడుతుండగా.. తెలంగాణలో మహిళలు 30.1 శాతం, పురుషులు 32.3 శాతంగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా స్థూలకాయులున్నట్లు సర్వేలో తేలింది. కరోనా, లాక్ డౌన్ తర్వాత దేశంలో ఒబేసిటీ పెరిగినట్టు సర్వే వెల్లడించింది.

ఇది కూడా చదవండి: జగన్‌కు ఇంకా తత్వం బోధ పడినట్లు లేదు.. త్వరలో ఆ ఒకటి మాయం అవుతుంది: లోకేష్‌

Advertisment
తాజా కథనాలు