RYTHU BIMA SCHEME: రాష్ట్రంలో కొత్తగా వ్యవసాయ భూములు రిజిస్టర్ చేయించుకున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) శుభవార్త చెప్పింది. రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతులు వ్యవసాయ శాఖలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆగస్టు 5 వరకు గడువు విధించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు రైతుబీమాకు అప్లై చేసుకోని 18 -59 ఏండ్ల వయసు గల రైతులు ఏఈవోకు దరఖాస్తులు ఇవ్వాలని తెలిపింది. అలాగే ఈ నెల 28 వరకు పట్టాదారు పాస్‌బుక్ వచ్చిన రైతులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హులైన రైతులు పట్టాదార్ పాస్‌బుక్ లేదా డిజిటల్ సంతకం చేసిన డీఎస్ పేపర్, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు దరఖాస్తుకు జత చేయాలని స్పష్టం చేసింది. స్థానిక రైతు వేదికలు, వ్యవసాయ అధికారిక కార్యలయాల్లోనూ దరఖాస్తులు సమర్పించవచ్చు. దీనికి ప్రత్యేక దరఖాస్తులు ఫామ్స్ ఉండవు.
పూర్తిగా చదవండి..Telangana Farmers: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ స్కీమ్ కు అప్లై చేసుకున్నారా?
రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతులు వ్యవసాయ శాఖలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆగస్టు 5 వరకు గడువు విధించింది. 18 -59 ఏండ్ల వయసు గల రైతులు ఏఈవోకు దరఖాస్తులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ బీమా కింద రూ.5 లక్షలు చెల్లిస్తారు.
Translate this News: