AP News: పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్కు ఇంకా తత్వం బోధ పడినట్లు లేదని టీడీపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. 50 రోజుల ప్రభుత్వంలో తాము భయంతో ఉండడం కాదు.. ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల బాధ్యతతో ఉన్నామని చెప్పారు. మీరే ఇంకా భ్రమల్లో ఉన్నారనే విషయం తెలుసుకోవాలంటూ విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జగన్ పోస్ట్ కు కౌంటర్ ఇచ్చిన లోకేష్.. జగన్ మాటల్లో, చేష్టల్లో, కుట్రల్లో అడుగడుగునా అధికారం దూరం అయ్యిందనే బాధ కనిపిస్తోందన్నారు. అక్రమార్జన ఆగిపోయిందనే ఆవేదన కనిపిస్తోంది. ఫేక్ రాజకీయం పండడం లేదనే ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. ఉనికి చాటుకోలేకపోతున్నామనే నిస్పృహ కనిపిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉక్రోషం కనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Nara Lokesh: జగన్కు ఇంకా తత్వం బోధ పడినట్లు లేదు.. త్వరలో ఆ ఒకటి మాయం అవుతుంది: లోకేష్
వైఎస్ జగన్కు ఇంకా తత్వం బోధ పడినట్లు లేదని టీడీపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉక్రోషంతో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. 11లో ఒకటి మాయం అవుతుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
Translate this News: