Devara Third Single: జాన్వీ- తారక్ రొమాంటిక్ డ్యూయెట్ వచ్చేసింది..?

ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. తాజాగా మేకర్స్ ఈ మూవీ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. థర్డ్ సింగిల్ 'దావుడి' సెప్టెంబర్ 4న విడుదల కానున్నట్లు తెలియజేస్తూ సాంగ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే రొమాంటిక్ డ్యూయెట్ గా ఈ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Devara Third Single: జాన్వీ- తారక్ రొమాంటిక్ డ్యూయెట్ వచ్చేసింది..?
New Update

Devara Third Single: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర'. పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. 'దేవర' పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన తారక్ ఫస్ట్ గ్లిమ్ప్స్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

దేవర థర్డ్ సింగిల్ 

దేవర థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. థర్డ్ సింగిల్ 'డావుడి' సెప్టెంబర్ 4న విడుదల కానున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే జాన్వీ- తారక్ రొమాంటిక్ డ్యూయెట్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన 'చుట్టమల్లే', 'దేవర ఆంథమ్' యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి. దీంతో థర్డ్ సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా ... రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూరుస్తున్నారు.

ఎన్టీఆర్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేని , కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Also Read: Bigg Boss 8 Telugu Promo: మొదటి రోజే బిగ్ బాస్ ఇంట్లో శేఖర్ భాష రచ్చ.. సోనియాతో గొడవ - Rtvlive.com 

#jr-ntr #devara #devara-third-single #janhavi-kapoor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి