Malayalam Movie Industry: జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చాక మలయాళం ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఒక్కొక్కరే బయటకు వస్తున్నారు. వీరిలో హీరోయిన్లు కూడా ఉన్నారు. తమకు జరిగిన అన్యాయాలు, వేధింపుల మీద వారు గొంతు ధైర్యంగా గొంతు విప్పుతున్నారు. తాజాగా ఓ నటి మలయాళ హీరో నివిన్ పౌలీ మీద ఫియాదు చేశారు. తనకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి దుబాయ్ తీసుకువెళ్ళి అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడ్డరని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీని మీద ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు నివిన్ పౌలీ సహా ఆరుగురిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఓ నిర్మాత కూడా ఉన్నాడు. నిందితుల జాబితాలో నివిన్ పౌలీని ఆరో వ్యక్తిగా చేర్చారు. ప్రస్తుతం ఇది కేరళ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
నివిన్ పౌలీ మలయాళం పెద్ద నటుడు. ఏడాదికి మూడు , నాలుగు సినిమాలు చేస్తాడు. ప్రేమమ్, బెంగళూరు డేస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడి ఇతను పరిచయమే. ఇప్పుడు నివిన్ మీద కేసు నమోదవడం అక్కడ ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే. ఇప్పటికే హేమ కమిటీ రిపోర్ట్ వచ్చాక మలయాళం మూవీ ఆర్టిస్టులు అమ్మకు రాజీనామా చేశారు. మోహన్‌లాల్‌తో సహా 17 మంది దీంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు నివిన్ విషయం బయటపడడంతో మలయాళం ఇండస్ట్రీ మరింత వేడెక్కి పోతోంది. ఈ నేపథ్యంలో మహిళలకు సురక్షిత వాఆవరణం కలిపించేందుకు అందరూ సహాయం చేయాలని మెగాస్టార్ మమ్మట్టి విజ్ఞప్తి చేశారు.
మరోవైపు తన మీద వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అంటున్నారు హీరో నివిన్ పౌలీ. ఈ ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించేందుకు ఎంత వరకైనా వెళ్తా. జరగాల్సింది లీగల్‌గానే జరుగుతుంది..అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Also Read: Paris: పారా ఒలింపిక్స్‌లో వరంగల్ అమ్మాయికి కాంస్యం