Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో సెకండ్ ఎపిసోడ్‌లో నామినేషన్స్ కంప్లీట్

బిగ్ బాస్ సీజన్ 7లో నిన్న సెకండ్ ఎపిసోడ్‌లో నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి.. సీసన్ 7 ప్రతి ఎపిసోడ్ ఉల్టా , ఫుల్టా లాగానే ఉంది .. ఎందుకంటే ఇంత వరకు జరిగిన సీసన్స్‌లో బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఇంటి సభ్యులను మీ నామినేషన్స్ రీసన్స్ వ్యాలిడ్ ఆ అని అడగలేదు కానీ ఈ సారి మాత్రం ప్రతి హౌస్‌మెట్‌ని అడుగుతున్నారు.

New Update
Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో సెకండ్ ఎపిసోడ్‌లో నామినేషన్స్ కంప్లీట్

Bigg Boss 7 Telugu Episode 2:  నిన్న జరిగిన నామినేషన్స్‌లో అందరి నామినేషన్స్ కాస్త కూల్ గానే కానించారు. శోభా శెట్టి (Shobha Shetty) మాత్రం కొంచం ఫైర్ మీద ఉన్నట్లు కనిపించింది. అందరు నామినేషన్స్‌ని కొంచం కూల్‌గా, లైట్ గానే తీసుకున్నట్లు అనిపించింది. కానీ శోభశెట్టి మాత్రం చాలా పర్సనల్‌గా తీసేసుకొని, ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది కూడా. నిన్న నామినేషన్స్‌లో అయితే మాక్సిమం ఓట్స్ శోభా, రతికా (Rathika)కి పడ్డాయి .. ఇక శోభాని, రతికాని నామినేట్ చేయడానికి ఇంచు మించుగా హౌస్ మేట్స్ అందరు చెప్పిన రీసన్స్ ఒకేలా అనిపించాయి. అదే వాళ్లిద్దరూ ఇంటి పనుల్లో, కిచెన్‌లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్నట్టుగా చెప్పారు. ఇంత మంది సేమ్ రీజన్ చెప్పారంటే నింజంగానే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదేమో అనిపిస్తుంది మరీ.

గట్టి గట్టిగా అరిస్తే నేను మాట్లాడలేను

శోభా అయితే గౌతమ్ కృష్ణ , కిరణ్‌ని నామినేట్ చేసింది. తను చెప్పిన రీసన్స్ కూడా అంత వ్యాలిడ్‌గా ఎం అనిపించాలి. అయినా ఉన్న ఒక్క రోజులో వ్యాలిడ్ రీసన్స్ అంటే కొంచం కష్టమే. శోభా నామినేషన్స్ తర్వాత గౌతమ్ ఇంకా శోభాకి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. గౌతమ్ నేను మిమల్ని సర్కాస్టిక్‌గా మేడం అని పిలవలేదు అది నాకు అలవాటు నేను అందరిని అలానే పిలుస్తాను కావాలంటే శోభని కూడా అడగండి అంటాడు. అప్పుడు శోభా మధ్యలో తను ఎందుకు వస్తుంది మీరు నాతోనే మాట్లాడండి అంటూ కొంచం టోన్ ఎక్కువ చేసి మాట్లాడుతుంది. అప్పుడు గౌతమ్ కృష్ణ ఇలా గట్టి గట్టిగా అరిస్తే నేను మాట్లాడలేనని చెప్పి వెళ్ళిపోతాడు.

దానికి కూడా శోభా నేను మాట్లాడుతుంటే ఎలా వెళ్ళిపోతారు. రెస్పెక్ట్ లేదా, ఇందుకే నేను మిమల్ని నామినేట్ చేశా అని అరుస్తూ వెళ్ళిపోతుంది. గౌతమ్ ఎంత మెచ్యూర్‌గా, కూల్‌గా చెప్పడానికి ట్రై చేసిన శోభా అర్థం చేసుకోకుండా కాస్త హైపర్ అయిపొతుందెమో అనిపించింది. గౌతమ్ విషయంలోనే కాదు దామిని విషయంలో కూడా ఇలాగే రియాక్ట్ అయ్యింది. మీరు నేను పనిచేయలేదని ఎలా నామినేట్ చేస్తారు. మీరు చూసారు నేను పని చేయలేదని అంటూ ఆర్గుమెంట్ చేస్తుంది. అప్పుడు దామిని సింపుల్‌గా నాకు అనిపించింది నేను చెప్పను మీకు నచ్చకపోతే నన్ను నామినేట్ చేస్కోండని చెప్తుంది.

శోభా శెట్టి చుట్టే నామినేషన్స్ 

గడిచిన ఒక్క రోజులో కూడా నామినేషన్స్‌లో అమర్ చెప్పిన రీసన్స్ కొంచం వ్యాలిడ్‌గా, మెచ్యూర్‌గా అనిపించాయి. ఇంకా టేస్టీ తేజా నామినేషన్స్ కొంచం ఫన్నీగా జరిగాయి. బిగ్ బాస్ తేజతో కామెడీ చేయడం బాగా అనిపించింది. ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేసారు. నిన్నటి ఎపిసోడ్‌లో అయితే శోభా శెట్టి బాగానే స్క్రీన్ స్పేస్ దక్కించుకుంది. నామినేషన్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర ఆర్గుమెంట్ చేస్తూ .. నామినేషన్స్ ని పర్సనల్ గా తీసుకొని ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను ఉండలేను అంటూ ఏడుస్తుంది .. ఇదంతా చూస్తుంటే శోభా కి నిజంగా కార్నెర్ అయ్యాను అనే ఫీలిం తో భాదపడుతుందా లేదా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి సింపతీ ట్రై చేస్తుందా ఏంటి అన్నట్లుగా అనిపిస్తుంది.

ఎదుకంటే తను ఒక పక్క గొడవ పడుతుంది మల్లి వచ్చి ఏడుస్తుంది. మరి నిన్నటి ఎపిసోడ్‌లో గౌతమ్ కృష్ణ మాటలు వింటే హౌస్ అప్పుడే గ్రూప్స్ అయ్యాయి అన్నట్లు అనిపించింది. గౌతమ్, శుభ ఇంకా కిరన్ మనం ఒక గ్రూప్ అని గౌతమ్ చెప్తూ ఉంటాడు. చూద్దాం ఈ గ్రూపులు ఎక్కడి వరకు వెళ్తాయో .. మొత్తానికి అయితే నిన్నటి ఎపిసోడ్ ఇంకా నామినేషన్స్ అంతా కూడా శోభా శెట్టి చుట్టే తిరిగినట్టు అనిపించింది.

Also Read: రౌడీ హీరోకు కొత్త తలనొప్పి.. ఫ్యాన్స్ సరే.. మా పరిస్థితేంటని కౌంటర్

Advertisment
Advertisment
తాజా కథనాలు