Delhi Liquor Scam: కేజ్రీవాల్‌కు షాక్.. అత్యవసర విచారణకు 'నో ' చెప్పిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ రిమాండ్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాని కేజ్రీవాల్‌ తరఫున న్యాయవాదులు ఢిల్లీ కోర్టును శనివారం ఆశ్రయించగా.. ఇందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బుధవారం విచారణ చేపడతామని తెలిపింది.

New Update
CM Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్.. సీబీఐకి నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై.. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ అరెస్ట్, ఈడీ రిమాండ్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాని కేజ్రీవాల్‌ తరఫున న్యాయవాదులు ఢిల్లీ కోర్టును శనివారం ఆశ్రయించారు. ఆయన రిమాండ్‌ను సవాలు చేస్తూ పిటీషన్‌ దాఖలు చేశారు. కానీ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బుధవారం విచారణను చేపడతామని తెలిపింది.

Also Read: ఆ ఉద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ తీసుకొచ్చాం: నితిన్ గడ్కరీ

అయితే ఈడీ.. మార్చి 28 వరకు తమ క్లైంట్‌కు కస్టడీ విధించడం చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మార్చి 24లోపు తాము దాఖలు చేసిన పిటిషన్‌ను వెంటనే విచారించాలని అభ్యర్థించారు. కానీ ఢిల్లీ హైకోర్టు అత్యవసర విచారణకు నిరాకరించలేదు.

ఇదిలాఉండగా.. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. శుక్రవారం రోజున రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు.. తమకు పదిరోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు ఆరు రోజులకు మాత్రమే కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే ఆయన జైల్లో నుంచే పరిపాలన అందిస్తారని ఆప్‌ నేతలు చెబుతున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తామని.. ఇందుకోసం కోర్టు పర్మిషన్ కూడా తీసుకుంటామని తాజాగా పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్ తెలిపారు.

Also Read: జైల్లోనే అరవింద్‌ కేజ్రీవాల్‌కు కార్యాలయం : భగవంత్ మాన్

Advertisment
తాజా కథనాలు